'మా' ఎన్నికల్లో ఎన్ని మలుపులు
on Mar 27, 2015
మా ఎన్నికల రోజురోజుకి అనేక మలుపులు తిరుగుతూ చాలా రసవత్తరంగా మారుతున్నాయి. మా అధ్యక్షపదవికి ఇద్దరు సీనియర్ నటులు ఇంతగా పోరాటం చేయడం అందరినీ చాలా ఆశ్చర్యపరుస్తోంది. రాజేంద్ర ప్రసాద్ రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నాడని జయసుధ ఆరోపిస్తుంటే ఆమె వెనుకే మురళీ మోహాన్ తో సహా అనేక మంది రాజకీయ నాయకులు జేరారని రాజేంద్రప్రసాద్ ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఇదిలా వుంటే సడన్ గా.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ కళ్యాణ్ అనే నటుడు కోర్టులో ఎన్నికల అవకతవలపై పిటిషన్ వేసినట్లు తెలిసింది. నామినేషన్ల స్వీకారంలో నిబంధనలు పాటించలేదని, సమయం దాటాక కూడా నామినేషన్లు తీసుకున్నారని, జయసుధ స్వయంగా నామినేషన్ వేయలేదని, ఇంకా పలు అంశాలను పిటిషన్ లో పెర్కొన్నట్లు తెలిసింది. ఈ పిటిషన్ ను కోర్టువిచారణకు స్వీకరిస్తే ఎన్నికలు వాయిదా పడే అవకాశం వుంది. ఏమయినప్పటికీ మా ఎన్నికలు సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా మంచి వేడివేడిగా సాగుతున్నాయి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
