రెండో చిత్రానికి కథ, మాటలు రాజావారే!
on Jul 15, 2020
‘రాజావారు రాణిగారు’ చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాధించింది. హీరో, హీరోయిన్, దర్శకుడు కొత్తవారైనా మంచి కంటెంట్, కామెడీ ఉండటంతో సినిమా హిట్ కొట్టింది. అందులో హీరోకి మరో రెండు ఛాన్సులు తెచ్చిపెట్టింది. అంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్ చేసి, ‘రాజావారు రాణిగారు’తో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన కిరణ్ అబ్బవరం, ప్రజెంట్ రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ రోజు (జూలై 15) అతడి బర్త్‌డే. విషెస్ చెబుతూ రెండు సినిమా యూనిట్స్ ఫస్ట్ లుక్స్ విడుదల చేశాయి. అందులో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ ఓ సినిమా కాగా, ‘సెబాస్టియన్’ మరో సినిమా. రెండిటికీ నిర్మాతలు వాళ్లే.. ప్రమోద్, రాజు.
‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తుండటమే కాదు... కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు అతడే రాశాడు. షార్ట్ ఫిలిమ్స్‌లో యాక్ట్ చేసేటప్పట్నుంచి రైటింగ్ మీద కాన్సంట్రేట్ చేశాననీ, ఆ అనుభవంతో ఇప్పుడు కథ రాశాననీ చెబుతున్నాడు. కళ్యాణమండపం నేపథ్యంలో కథ సాగుతుందనీ, అందుకే ఆ టైటిల్ పెట్టామన్నాడు. లవ్ స్టోరీ, ఫాదర్ అండ్ సన్ రిలేషన్, కామెడీ... సినిమాలో అన్నీ ఉన్నాయట. నాలుగేళ్లుగా దర్శకుడు శ్రీధర్‌తో ట్రావెల్ చేస్తున్నానని, ఇద్దరికీ మంచి సింక్ ఉంద న్నాడు. ఈ కుర్రాడిది కడపలోని రాయచోటి. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ కడప నేపథ్యంలో తీస్తున్నారు. పాత్రలన్నీ రాయలసీమ యాసలో మాట్లాడతాయట.