కొరటాల కూడా దేవీశ్రీని పక్కన పెడుతున్నాడా?
on Sep 21, 2019
త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, సుకుమార్... ఒకప్పుడు తెలుగులో ఈ అగ్ర దర్శకుల సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ ఆస్థాన సంగీత దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి, దేవిశ్రీకి మధ్య ఏమైందో ఏమో.... ఎస్.ఎస్. తమన్, అనిరుధ్ రవిచంద్రన్ వంటి యువ సంగీత దర్శకుల పేర్లు త్రివిక్రమ్ తీసిన 'అరవింద సమేత వీరరాఘవ', 'అజ్ఞాతవాసి' పోస్టర్ల మీద పడ్డాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న 'అల... వైకుంఠమురములో'కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. దేవిశ్రీని త్రివిక్రమ్ ఎందుకు పక్కన పెట్టాడనేది మిలియన్ డాలర్ క్వశ్చన్. ఇప్పుడు కొరటాల కూడా దేవిశ్రీని పక్కన పెడుతున్నాడని ఇండస్ట్రీ గుసగుస. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 'సైరా' విడుదల తరవాత పట్టాలు ఎక్కనున్న ఆ సినిమాకు హిందీ సంగీత దర్శకుణ్ణి తీసుకునే ఆలోచనలో ఉన్నారట. 'సైరా'కి అమిత్ త్రివేది స్వరాలు సమకూర్చగా, జూలియస్ పేకియమ్ నేపథ్య సంగీతం అందించారు. కొరటాల శివ సినిమాకు ఎవరిని తీసుకొస్తారో?

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
