తారక్ సరసన కియారా?
on Nov 22, 2020
'భరత్ అనే నేను'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఉత్తరాది భామ కియారా అద్వాని. ఆ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కనువిందు చేసిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆపై 'వినయ విధేయ రామ'లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన కూడా మురిపించింది. అయితే ఆ తరువాత మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమపై శీతకన్నేసింది కియారా. వరుస హిందీ చిత్రాలతో బాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది మిస్ అద్వాని.
కట్ చేస్తే.. త్వరలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో మళ్ళీ తెలుగు చిత్ర పరిశ్రమలో సందడి చేయనుందట ఈ అమ్మడు. ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ టైగర్ జూనియర్ యన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 'అరవింద సమేత' తరువాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో మెయిన్ లీడ్‌గా కియారాని ఎంపిక చేసే దిశగా త్రివిక్రమ్ అండ్ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నారట. మరి.. కియారా ఈ మూవీకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.
ఇదివరకు ఈ పాత్ర కోసం పూజా హెగ్డే, రష్మిక, కీర్తి సురేష్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. చూడాలి మరి.. చివరాఖరికి ఎవరు తారక్‌తో జట్టుకడతారో?

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
