కాజల్‌ని చూడాలంటే భయమేసిందట.?
on Jan 11, 2017
కలువ కళ్లతో, ఆకట్టుకునే స్మైల్‌తో, వరుస ఆఫర్లతో నెంబర్ వన్ చైర్లో కూర్చున్నారు పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఒకదశలో కుర్ర హీరోలకు, సీనియర్ హీరోలకు ఆమె ఛాయిస్..అలా 30+లో కూడా యంగ్ హీరోయిన్లకు పోటి ఇస్తోంది కాజల్..మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిని పేర్లు తెరమీదకు వచ్చినప్పటికీ కాజల్‌నే ఆ గోల్డెన్ ఛాన్స్ వరించింది. ఇవాళ ఖైదీ నెం 150 విడుదలవ్వడంతో సినిమాలో చిరంజీవి పక్కన కాజల్ ఎలా స్టెప్పులేసిందో..ఇద్దరికీ జోడి ఎలా కుదిరిందో చూద్దామనుకున్న అభిమానుల్ని ఈ ముద్దుగుమ్మ నిరాశపరిచిందట. సినిమాలో కాజల్‌ని చూసిన వారికి ఏడుపు ఒక్కటే తక్కువట. 60 ఏళ్ల వయసులో మెగాస్టార్ అందంగా కనిపించారు కానీ..యంగ్‌గా ఉన్ప కాజల్‌లో మాత్రం ఆ ఛార్మింగ్ లేదట. కేవలం పాటల వరకే కాజల్‌ను పెట్టి మంచి పనిచేశారు అని అభిమానులు అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాలను బట్టి కాజల్ కథ కంచికి చేరినట్లే అంటున్నారు ఫ్యాన్స్.