ఖైదీ నెం.150 ఫస్టాఫ్ రివ్యూ
on Jan 11, 2017
తొమ్మిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం 150 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులు తెల్లవారుజాము నుంచే టిక్కెట్ల కోసం పడిగాపులు కాశారు. ఈ సినిమా మార్నింగ్ షో తెలుగు రాష్ట్రాల్లో స్టార్టయ్యింది. ఇంటర్వెల్ కావడంతో ఫోన్ల ద్వారా తమ సన్నిహితులతో సినిమా వివరాలను పంచుకుంటున్నారు. చిరు గురించి చెప్పడానికి ఏముంటుంది..60 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కుర్రాడిలా నటించి తనలో వాడి తగ్గలేదని నిరూపించాడట. హీరోయిన్ కాజల్ అందాల ప్రదర్శన సినిమాకు చాలా ప్లస్ అయ్యిందని అంటున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుందంటూ కితాబిచ్చాడు. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్‌లో తన తండ్రితో స్టెప్పులు వేస్తూ చెర్రి ఎంట్రీ అదిరిపోయింది. ఇంటర్వెల్ ముందు వచ్చిన ఫైట్స్, డైలాగ్స్ అదిరిపోయాయి. మొత్తం మీద సెకండాఫ్ టెర్రిఫిక్‌గా ఉంది..ఖైదీ నెం. 150 టోటల్ మూవీ రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగువన్.కామ్