సలార్లో అతిథిగా యశ్?
on Jan 15, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫస్ట్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ సలార్. యాక్షన్ సాగాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. కాగా, ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేజీఎఫ్ స్టార్ యశ్ హాజరయ్యారు.
కాగా, సలార్ కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఇందులో యశ్ అతిథి పాత్రలో కనిపిస్తారట. పాత్ర నిడివి తక్కువే అయినా.. చాలా ప్రత్యేకంగా ఉంటుందని వినిపిస్తోంది. మరి.. సలార్ లో యశ్ అతిథి పాత్ర వార్తలకే పరిమితమో కాదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. జనవరి నెలాఖరు నుంచి సలార్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని.. ఈ సంవత్సరం దసరాకి సలార్ తెరపైకి వచ్చే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
