ప్లీజ్ నన్ను కాపాడండి..మోడీకి కట్టప్ప కూతురు లేఖ..!
on Jul 17, 2017

బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాడు. అలాంటి కట్టప్పకు ఒక కూతురు ఉంది..ఆమె పేరు దివ్య ప్రస్తుతం డాక్టర్‌గా విధులు నిర్వరిస్తుంది. మీడియాకు చాలా దూరంగా ఉండే ఆమెకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి..అమెరికాకు చెందిన ఓ ఫార్మాసూటికల్ సంస్థ తయారు చేసిన టాబ్లెట్స్‌లో విటమిన్స్ డోస్ ఓవర్‌గా ఉందని గుర్తించిన దివ్య వాటిని రోగులకు ఇచ్చేందుకు తిరస్కరించిందట. దీంతో ఆ విదేశీ సంస్థ మాటలతో చెప్పి చూసింది..లంచం కూడా ఇచ్చేందుకు ప్రయత్నించింది..అయినా మాట వినకపోవడంతో చంపుతామని బెదిరించారు..ఈ క్రమంలో దివ్య ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసినట్లు కోలీవుడ్ టాక్. కొన్ని రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు తన క్లినిక్‌కు వచ్చి..విటమిన్, కొవ్వు కరిగించే మందులని చెప్పి రోగులకు రాసివ్వాలని ఒత్తిడి తెచ్చారని అయితే శాస్త్రీయ కాలపరిమితి లేకుండా మందులని రాసివ్వనని చెప్పడంతో తనను బెదిరించారని..వారికి మనదేశంలోని రాజకీయ ప్రముఖులతో కూడా మంచి సంబంధాలున్నట్లు దివ్య లేఖలో తెలిపారు. ఈ వార్త కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది ఇలాంటి విషయాలను బయటకు చెప్పరని..కానీ దివ్య ధైర్యంగా మోడీకి ఫిర్యాదు చేయడం గొప్ప విషయమని సోషల్ మీడియాలో దివ్యను అభినందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



