బాలీవుడ్ హీరో మెడికల్ బిల్లు చెల్లించిన సల్మాన్
on Oct 15, 2020
కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తనది పెద్ద మనసు అని నిరూపించుకున్నాడు. బీయింగ్ హ్యూమన్ చారిటీ సంస్థను స్థాపించిన అతడు ఎందరికో సహాయం చేస్తున్నాడు. కరోనా కాలంలో కొన్ని
గ్రామాలకు నిత్యావసర సరుకులు పంపించాడు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అనారోగ్యం పాలై మెడికల్ బిల్లు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్న ఒకప్పటి బాలీవుడ్ హీరో ఫరాజ్ ఖాన్ కి సల్మాన్
సహాయం చేశాడు. అసలు వివరాల్లోకి వెళితే....
రాణి ముఖర్జీ 'మెహందీ' (1998)లో, అలాగే 'ఫరేబ్' చిత్రాలలో హీరోగా నటించిన ఫరాజ్ ఖాన్ గత సంవత్సర కాలంగా శ్వాసకోస ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల అతను బెంగళూరు లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. వైద్యానికి పాతిక లక్షలు ఖర్చు అవుతాయని చెప్పారట. అంత మొత్తం ఫరాజ్ కుటుంబం దగ్గర లేకపోవడంతో అతని సోదరుడు ప్రజలకు సహాయం చేయమని ఒక ఫండ్ రైజర్ ప్రారంభించారు. ఈ విషయం తెలిసిన సల్మాన్ ఖాన్ ఫరాజ్ మెడికల్ బిల్లులు అన్ని చెల్లించారని నటి కాశ్మీరా షా తెలిపారు.
Also Read