కంగనా రనౌత్ క్షుద్రపూజలు చేస్తుందట..!
on Apr 28, 2016
కంగనా రనౌత్ హృతిక్ రోషన్ కాంట్రవర్సీలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కంగనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అధ్యయన్ సుమన్ ఆమె గురించి కొన్ని షాకింగ్ విషయాల్ని బాలీవుడ్ కు వెల్లడించాడు. కంగనా బ్లాక్ మ్యాజిక్ ను ప్రాక్టీస్ చేస్తుందని, తనను కూడా క్షుద్రపూజలు చేయమనేది అంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు అధ్యయన్. తమ మధ్య లవ్ స్టోరీ నడిచిన సమయంలో, ఆమె బిహేవియర్ అసలు అర్ధం అయ్యేది కాదని, ఒక్కో నిముషం ఒక్కోలా మారిపోయేదని తనను చాలాసార్లు కొట్టేదని, తిరిగి కొట్టడం ఇష్టం లేక తనలో తనే బాధపడేవాడినని చెబుతున్నాడు అధ్యయన్ సుమన్.
తనను పల్లవి అనే ఒక మాంత్రికురాలి దగ్గరకు తీసుకెళ్లి, క్షుద్రపూజలు చేయించే ప్రయత్నం చేసిందని, ఆమె చేయించిన పూజల వల్లే తన కెరీర్ ఎందుకూ పనికిరాకుండా పోయిందని వాపోతున్నాడు. అధ్యయన్, కంగనా కలిసి రాజ్ 2 లో నటించారు. కానీ ఆ సినిమా తర్వాత అతనికి కంగనా తో బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత దేశం విడిచి వెళ్లిపోయాడు. తనతో రిలేషన్ షిప్ లో ఉండగానే, కంగనా హృతిక్ అంటే పడిచచ్చిపోయేదని, అతనంటే ఆమెకు విపరీతమైన పిచ్చి ఉందని, కానీ హృతిక్ ఎప్పుడూ కంగనా మీద ఎలాంటి ఫీలింగ్స్ చూపించలేదని అధ్యయన్ చెబుతున్నాడు. కంగనా హృతిక్ ల సీన్ లో, హృతిక్ రోషన్ కు అన్ని వైపులా మద్దతుతో పాటు, కంగనా మాజీ లవర్ అధ్యయన్, తన మాజీ భార్య సుజానే నుంచి కూడా సపోర్ట్ రావడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



