అనురాగ్‌ను అరెస్ట్ చేయాలంటున్న కంగనా!
on Sep 21, 2020
హిందీ సినిమాల దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన కథానాయిక, నటి పాయల్ ఘోష్‌కి కంగనా రనౌత్ అండగా నిలిచింది. అనురాగ్‌ను అరెస్ట్ చేయాలని కంగనా ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసింది. ప్రతి ఒక్కరి మాటలను గౌరవించాలని ఆమె పేర్కొన్నారు.
"నాకు తెలిసినంతవరకు అనురాగ్ కశ్యప్ వివిధ వ్యక్తులతో వివాహ బంధంలో ఉన్నప్పటికీ... ఒక్కరితోనే శారీరక, లైంగిక సంబంధాలు పెట్టుకోలేదని అనురాగ్ కశ్యప్ కూడా అంగీకరిస్తాడు. పాయల్‌తో అనురాగ్ చేసినది బాలీవుడ్లో సర్వ సాధారణ విషయమే. బయట నుండి ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలను అమ్మాయిలను సెక్స్ వర్కర్లలాగా చూడటం సహజమే. పాయల్ చెప్పినట్టు అనురాగ్ చేయగలడు. తన పార్ట్నర్స్ అందరినీ అనురాగ్ చీట్ చేశాడు" అని కంగనా రనౌత్ ట్వీట్లు చేశారు.
బాలీవుడ్ అంతా లైంగిక వాంఛలతో కూడిన వ్యక్తులతో నిండినదనీ, బాలీవుడ్ లో మీటూ పెద్ద ఫెయిల్యూర్ అనీ కంగనా రనౌత్ అన్నారు. హిందీ చలన చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలను నోళ్లు ఎలా చేశారో కూడా అలాగే నొక్కేసి ఉండవచ్చని కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు.
Also Read