కమల్ హాసన్ ' శభాష్ నాయుడు ' మోషన్ పోస్టర్..!
on Apr 29, 2016

లోకనాయకుడు కమల్ హాసన్ తర్వాతి సినిమా ' శభాష్ నాయుడు ' మోషన్ పోస్టర్ రిలీజైంది. తెలుగు, తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. హిందీలో టైటిల్ ను శభాష్ కుందు అని పెట్టారు. వెనక భయపడుతూ కూర్చుని ఉన్న బ్రహ్మానందంతో బైక్ పై హడావిడిగా దూసుకెళ్తున్న కమల్ ను చూడగానే మంచి కామెడీ సినిమా అనే ఫీల్ కలుగుతోంది . దశావతారంలో గవర్నమెంట్ ఆఫీసర్ బలరాం నాయుడు కోసం వేసిన లుక్ తోనే ఈ సినిమాలో కమల్ కనిపించడం విశేషం. చెన్నైలోని నడిగర్ సంఘం కాంప్లెక్స్ లో ఈరోజు తన సినిమాను రివీల్ చేశారు కమల్. తెలుగు తమిళంలో బ్రహ్మానందం నటిస్తుండగా, హిందీలో సౌరభ్ శుక్లా ఆ పాత్రను పోషిస్తున్నారు. కమల్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా, ఆయన కూతురు శృతి హాసన్ సినిమాలో కూడా కూతురిగా నటించడం విశేషం. సినిమాలో బ్రహ్మానందం, కమల్ కు అసిస్టెంట్ గా కనిపిస్తారని సమాచారం. రాజీవ్ కుమార్ సినిమాకు డైరెక్షన్ చేస్తుండగా, ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



