నా కొడుకు అంత మాట అనేశాడు..!
on Jul 8, 2017

నా కొడుకు, వాళ్లమ్మ ఒక్కటైపోయారని.. నా మీద కుట్ర పన్నారని జూనియర్ ఎన్టీఆర్ సరదాగా వ్యాఖ్యానించాడు. బిగ్ బాస్ రియాలిటీ షోకి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు సంబంధించి మరో ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకు గురించి మాట్లాడుతూ..నాకు, నాకొడుక్కి చాలా అటాచ్ మెంట్ ఉందని.. నేను రోజూ షూటింగ్ కు వెళ్లే ముందు వాడిని దగ్గరకి తీసుకుని "నీకు ఎవరంటే ఇష్టం నాన్నా...అమ్మా? నాన్నా?" అని అడిగితే వాడు టక్కున "నాన్న" అని అసమాధానం చెప్పేవాడు. అయితే ఈ మధ్య వాడు స్కూల్ కు వెళుతుండటంతో నేను వచ్చేసరికి నిద్రపోతున్నాడు... లేచే సరికి స్కూల్ కు వెళుతున్నాడు.. దీంతో ఈరోజు ఉదయం వాడు "నాన్నా" అనుకుంటూ తన దగ్గరకి వచ్చాడని, వాడితో మాట్లాడుతూ.."నాన్నా నీకు ఎవరంటే ఇష్టం అమ్మా? నాన్నా?" అని అడగ్గానే ఎప్పుడూ "నాన్న" అనే వాడు సడెన్ గా "అమ్మ" అనేశాడని... వాడు, వాళ్లమ్మ ఒక్కటైపోయారని...ఇంత పెద్ద కుట్ర ఎప్పుడు జరిగిందో ఇంటికెళ్లగానే వాళ్లమ్మతో తేల్చుకోవాలని సరదాగా వ్యాఖ్యానించాడు. ఈనెల 13 నుండి షూటింగ్ లో పాల్గొంటానని..16న బిగ్ బాస్ షో ప్రారంభమవుతుందని చెప్పాడు. కాగా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ బిగ్ బాస్ షో 70 రోజుల పాటు జరుగుతుంది. ఇందులో 12 మంది పోటీదార్లు పాల్గొననున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



