ట్రైలర్ రివ్యూ: జయ జానకీ నాయక
on Aug 1, 2017

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను..యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న జయ జానకీ నాయక మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమం ముగిసింది.. ఇప్పటికే రెండు టీజర్లతో ఆడియన్స్‌లో హైప్ తీసుకొచ్చిన చిత్ర యూనిట్ ఆడియో లాంఛ్ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఫస్ట్ టీజర్‌లో తన రెగ్యులర్ సినిమాల్లా ఎక్కడా మాస్ ఛాయలు మచ్చుకైనా కనిపించకుండా తనలోని మరో యాంగిల్‌ను బయటపెట్టాడు బోయపాటి..పూర్తి క్లాస్ టచ్‌తో ఆ టీజర్ ఫ్యామిలీ ఆడియాన్స్‌ని ఆకట్టుకుంది. అయితే రెండో టీజర్లో మాత్రం తన అసలు సిసలు అస్త్రాన్ని వదిలాడు బోయపాటి. ఫైట్లు, కత్తులు, సుమోలతో హీరో బెల్లంకొండ శ్రీను హీరోయిజాన్ని ఎలివేట్ చేశాడు. ఇక ట్రైలర్‌లో మాత్రం మాస్ ఎలిమెంట్స్‌నే హైలెట్ చేశాడు శ్రీను. "ఎవరున్నా లేకున్నా..ఎవరొచ్చినా రాకున్నా నీకు నేనున్నా" అంటూ వచ్చే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. సినిమాలోని ప్రతీ క్యారెక్టర్‌ను టచ్ చేస్తూ టైలర్ కట్ చేశారు. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా..జగపతిబాబు, శరత్ కుమార్, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



