జయ జానకీ నాయక ఆడియన్స్ రివ్యూ
on Aug 11, 2017

ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ కాంభినేషన్‌లో తెరకెక్కిన జయ జానకీ నాయక ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సహజంగానే బోయపాటి సినిమా అంటే యూత్‌తో పాటు మాస్‌లో కూడా విపరీతమైన క్రేజ్ ఉండటం..ఇప్పటికే రిలీజైన రెండు టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో జయ జానకీ నాయకపై ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. దుష్టుల నుంచి తాను ఇష్టపడిన అమ్మాయిని కాపాడే కుర్రాడిగా బెల్లంకొండ శ్రీనివాస్ అదిరిపోయే యాక్టింగ్ చేశాడట..నటుడిగా కూడా బాగా పరిణితి సాధించాడట. ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా సాగిపోతుందట..ఇక సెకండాఫ్ నుంచి బోయపాటి తనలోని మాస్ యాంగిల్ బయటకు తీశాడట..ఫైట్లు, పంచ్ డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్‌తో కథను పరుగులు పెట్టించాడట..ఒక మంచి లవ్ ఫీల్‌తో ఆడియన్స్ బయటకు వస్తారట..ఈ సినిమా జనాలకి కనెక్ట్ అయితే బోయపాటి ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ వేసుకోవచ్చంటున్నారు ఆడియన్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



