జవాన్ ప్రీల్యూడ్ రివ్యూ
on Aug 1, 2017

కొత్త కథల్ని ఎంచుకుంటూ, నూతన దర్శకులని పరిచయం చేస్తూ సాయి ధరమ్ తేజ్ ముందుకు వెళ్తున్నాడు. ఒక్కోసారి కొన్ని ప్రయోగాలు విఫలం అవ్వొచ్చు కానీ, అవి సక్సెస్ అయితే మాత్రం ఆనందానికి హద్దు, అదుపూ ఉండదు. పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్ ఆ కోవలోకి వచ్చేవే. ప్రస్తుతం, సాయి ధరమ్ తేజ్ జవాన్ సినిమా చేస్తున్నాడు. సరికొత్త లుక్ లో తేజ్ భలే ఉన్నాడు. ఈ సినిమా ప్రీల్యూడ్ వీడియో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంది. "కొంత మంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది… కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది… దేశ భక్తి అనేది కిరీటం కాదు… కృతజ్ఞత…" అంటూ వచ్చే డైలాగ్ సినిమా లో దేశభక్తి తాలూకు ఛాయలు ఎంత మోతాదులో ఉండబోతున్నాయో హింట్ ఇస్తుంది. మొత్తానికి, జవాన్ మంచి కంటెంట్ ఉన్న సినిమాగా అగుపిస్తుంది. దర్శకుడు బీవీఎస్ రవి ఎంతో ఇష్టంగా రాసుకున్న కథ ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



