హోస్ట్ గా ఎవరు బెస్ట్..?
on Jul 8, 2017

ఒకప్పుడు బుల్లితెరపై యాంకరింగ్ చేయాలంటే హీరోస్ ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. యాంకర్స్ పోటీ ఇచ్చేవిధంగా స్టార్ హీరోస్ సైతం హోస్ట్ గా వ్యవహరిస్తూ.. న్యూ ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. 'మీలో ఎవడు కోటీశ్వరుడు' ప్రోగ్రాం ద్వారా హీరో నాగార్జున తొలిసారి ఈ పద్దతికి బీజం వేశారు. ఇక ఆ తరువాత ఆ ప్రోగ్రాం నుండి నాగార్జున తప్పుకున్నారు. నాగార్జున తరువాత అదే ప్రోగ్రాంకు మెగా స్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించారు. మరి బుల్లితెరపై చిరంజీవి హోస్ట్ గా అంటే అది మామూలు విషయం కాదు. చిరంజీవి హోస్ట్ అనే సరికి ఈ ప్రోగ్రాం కు వచ్చిన హైప్ కూడా అంతా ఇంతా కాదు. కొంతమంది ప్రేక్షకులు అయితే చిరంజీవి కోసమే షో చూశారు అనడంలో అతిశయోక్తిలేదు.
ఇక యంగ్ హీరోల విషయానికొస్తే బాహుబలి సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న రానా కూడా బుల్లితెరపై ఓ ప్రోగ్రాంకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. నెం.1 యారీ అనే ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యారీ అంటే స్నేహితుడు అని అర్థం. సెలెబ్రెటీస్ తమ జీవితాల్లో జరిగిన ఆసక్తికరమైన ముచ్చట్లు పంచుకోడానికి రానా ఈ కార్యక్రమం చేస్తున్నాడు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ రియాలిటీ షో కి హోస్ట్ గా చేస్తున్నాడు. ఈ షోకి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక ప్రోమోలు, ఎన్టీఆర్ ఎనర్జీ చూస్తుంటే ఈ షో మూమూలుగా ఉండదనిపిస్తోంది. ఇలా స్టార్ హీరోస్ బుల్లితెరపై కూడా తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. మరి సినిమాల్లో అయితే వీళ్లు వాళ్లకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. మరి బుల్లితెరపై వీళ్లు ఎంతమందిని ఆకట్టుకున్నారు.. మరి వీరిలో ఎవరు బెస్ట్ హోస్టో మీరే చెప్పండి..?. అంతేకాదు ఇంకా ఎంతమంది హీరోస్ వీరి రూట్ లోకి వస్తారో.. హోస్ట్ గా చేస్తారో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



