English | Telugu

మన కథానాయకల్లో ‘వన్ సినిమా వండర్స్’

on Aug 7, 2017

కొన్ని సినిమాలు... వాటిల్లో నటించిన వారిని రాత్రికి రాత్రి సూపర్ స్టార్లను చేసేస్తాయి. కానీ... ఆ తర్వాత మళ్లీ వారికి విజయం వరించదు. ఆ మాటకొస్తే... కొన్నాళ్లకు వాళ్లు కనిపించరు కూడా. ఇలాంటి వారిని ‘వన్ సినిమా వండర్స్’ అంటారు. అలాంటివారి గురించి  సరదాగా కాసేపు చర్చించుకుందాం. 

‘వన్ సినిమా వండర్’అనగానే...  గుర్తురావాల్సింది కచ్చితంగా 1989 సంవత్సరమే. ఎందుకంటారా?  తెలుగులో గీతాంజలి, బాలీవుడ్ లో ‘మైనే ప్యారికియా’చిత్రాలు విడుదలైంది ఆ ఏడాదే కదా . ఆ సినిమాల ద్వారా తెరకు పరిచయమైన కథానాయికలు గిరిజ, భాగ్యశ్రీ ‘వన్ సినిమా వండర్స్’ అనే పదానికి నిలువెత్తు సాక్ష్యాలు. కుర్రకారు హృదయాల్లో నిప్పులు రాజేశారు వీరిద్దరూ. అలాగే... మంచులా కరిగించేశారు కూడా. 

అసలు గిరిజ హీరోయిన్ కావాలని అనుకోలేదట. గిరిజ తండ్రి కన్నడ డాక్టర్. తల్లి బ్రిటిషర్.  ఇంగ్లాండ్ లో సెటిలైన ఫ్యామిలీ వారిది. అక్కడే గిరిజ పుట్టింది. ఒక పార్టీలో అనుకోకుండా గిరిజను చూశారు మణిరత్నం. తన ‘గీతాంజలి’కథలో నాయికకు ఉండాల్సిన అర్హతలన్నీ గిరిజలో చూశాడు. అంతే, గిరిజ తండ్రికి ప్రపోజల్ పెట్టేశారు. కొన్ని కండీషన్స్ తో ఆయన కూడా  ఒప్పుకున్నారు. ఆ విధంగా‘గీతాంజలి’కి నాయికయ్యింది గిరిజ. ఇక ఆ సినిమా విడుదలైంది. గిరిజ మేనియా... మొదలైంది. ఎక్కడ చూసినా గిరిజ.. గిరిజ... గిరిజ. ‘గీతాంజలి’లో గిరిజ వేసుకున్న డ్రస్ ‘గీతాంజలి డ్రస్’గా పెద్ద పాపులర్. ఇప్పటికీ కొంతమంది అమ్మాయిలు అవి వేసుకొని కనిపిస్తుంటారు. ఆ  తర్వాత గిరిజ రెండు మూడు సినిమాల్లో నటించింది. అన్నీ ఫ్లాపులే. తర్వాత ఆమె కనిపించలేదు. అందుకే... ఆమె ‘వన్ సినిమా వండర్’. 

గిరిజ మేనియా తెలుగునేలకే పరిమితమైతే, భాగ్యశ్రీ మేనియా దేశం మొత్తం చలి పుట్టించేసింది. ‘మైనే ప్యారికియా’విడుదలైనప్పట్నుంచీ దేశంలో ఏ అమ్మాయిని చూసినా, భాగ్యశ్రీలా  కనిపించేది. భాగ్యశ్రీ హెయిర్ స్టైల్, భాగ్యశ్రీ డ్రస్.. భాగ్యశ్రీ ఆర్నమెంట్స్... అంటూ వ్యాపారస్తులు తెగ సంపాదించేశారంటే నమ్మండి. ఇక  భాగ్యశ్రీ ‘నవ్వు’కుర్రాళ్లకు నిద్ర కరువు చేసింది. భాగ్యశ్రీ లాంటి అమ్మాయిని లవ్ చేయాలని, భాగ్యశ్రీ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కనని కుర్రాడు ఆ రోజుల్లో లేడంటే అతిశయోక్తి కాదు. ‘మైనే ప్యారికాయా’చిత్రం ‘ప్రేమ పావురాలు’పేరుతో తెలుగునాట డబ్ అయి... ఇక్కడ కూడా విజయదుంధుభి మోగించేసింది. ఆ తర్వాత భాగ్యశ్రీ చాలా హిందీ సినిమాల్లో నటించింది. కానీ... విజయం మాత్రం ఆమెకు ముఖం చాటేసింది. పైగా ఆ రోజుల్లో టాప్ హీరోయిన్లుగా చలామణీ అవుతున్న శ్రీదేవి, మాధురీ దీక్షిత్, శిల్పాశెట్టి లాంటి వారి స్పీడ్ ముందు భాగ్యశ్రీ నిలబడలేకపోయిందనే చెప్పాలి. దాంతో ‘వన్ సినిమా వండర్’గా నిలిచిపోయింది. 

1998లో ‘తొలిప్రేమ’అనే సినిమా విడుదలైంది. సినిమా సూపర్ హిట్. పవన్ కళ్యాన్ ని నటునిగా వంద మెట్ల పైన కూర్చోబెట్టిందా సినిమా. దర్శకుడు కరుణాకరన్ ని రాత్రికి రాత్రి స్టార్ ని చేసేసింది. ఆ సినిమా ద్వారా కథానాయకగా నటించిన కీర్తిరెడ్డి తమిళంలో అప్పటికే ఓ అయిదు సినిమాలు చేసింది. అన్నీ ఫ్లాపులే. ‘తొలిప్రేమ’తో.. సూపర్ స్టార్ అయిపోయింది కీర్తిరెడ్డి. నిర్మాతలు ఈ ముద్దుగుమ్మ ఇంటిముందు క్యూలు కట్టారు. కానీ ఏం లాభం? తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే. దాంతో సినిమాల్లో నటించడమే విరమించుకొని ‘వన్ సినిమా వండర్’గా మిగిలిపోయింది కీర్తిరెడ్డి.  

కీర్తిరెడ్డి తర్వాత మళ్లీ ఆ స్థాయిలో కుర్రకారుని ఇబ్బంది పెట్టిన కథానాయిక అంటే మాత్రం కచ్చితంగా ‘రీచా’ పేరునే చెప్పాలి. 2001లో ‘నువ్వేకావాలి’సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యింది రిచా. అసాధారణ విజయాన్ని నమోదుచేసుకున్న ఆ చిత్రం నిజంగా బాక్సాఫీస్ చరిత్రలో ఓ అద్భుతం. అందులో జంటగా నటించిన యువజంట తరుణ్, రీచా... టీనేజ్ కుర్రకారుకి ఐకాన్స్ గా నిలిచారు. కానీ... తరుణ్ తర్వాత కాలంలో హీరోగా సక్సెస్ అయినా... రిచా మాత్రం వరుస పరాజయాలతో సినిమా రంగం నుంచి నిష్క్రమించింది. ఆ విధంగా తనను కూడా ఓ ‘వన్ సినిమా వండర్’అనొచ్చు,

ఇంకా ‘ఆది’ చిత్రం ద్వారా పరిచమైన కీర్తి చావ్లా, ‘గంగోత్రి’ చిత్రం ద్వారా పరిచయమైన అదితీ అగర్వాల్, ‘ఆర్య’తో పరిచయమైన అను మెహతా, ‘దిల్’సినిమాతో పరిచయమై నేహ, ‘7/జి బృందావన్ కాలనీ’చిత్రం ద్వారా పరిచయమైన సోనియా అగర్వాల్, ‘చాలాబాగుంది’ద్వారా పరిచయమైన మాళవిక... ఇలా ఇంకా చాలామంది ఉన్నారు. గిరిజ, భాగ్యశ్రీ, కీర్తిరెడ్డి, రిచా అంత కాకపోయినా... వీరు కూడా పాపం ‘వన్ సినిమా వండర్సే’. 


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here