English | Telugu

2017 లో టాలీవుడ్ ని షేక్ చేసిన అంశాలు

on Jan 1, 2018

2017 టాలీవుడ్ కి కొన్ని మంచి చేకూరిస్తే, కొన్ని మరచిపోలేని షాక్స్ కూడా ఇచ్చింది. 2018 లో అడుగుపెడుతున్న సందర్బంగా, మంచో చెడో 2017 లో టాలీవుడ్ ని షేక్ చేసిన అంశాలు ఏంటో తెలుసుకుందామా!

చిరంజీవి రీ-ఎంట్రీ
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఖైదీ నం 150 తో రీ ఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా, చిరు లోని నటుణ్ని మరొక సారి బయటపెట్టింది. క్లాస్, మాస్ అంటూ లేకుండా అన్ని వర్గాల వారిని మెప్పించిన చిరు, ఫ్యాన్స్ కి 2017 లో మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు.

బాలకృష్ణ 100 వ సినిమా:
తన వందవ సినిమా రొటీన్ గా ఉండకూడదు అని భావించిన బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కి ఓకే చెప్పాడు. అతి తక్కువ సమయంలో సినిమా కంప్లీట్ చేసి తన డెడికేషన్ ఏంటో నిరూపించుకున్నాడు. సంక్రాంతికి తెలుగు వారికి సరయిన విందు ఈ సినిమా రూపంలో దొరికిందని చెప్పొచ్చు.

అఖిల్ మ్యారేజ్ క్యాన్సల్ వ్యవహారం:
బిజినెస్ మాన్ జీవీకే రెడ్డి మనవరాలు మరియు సెలబ్రిటీ డిజైనర్ శ్రీయ భూపాల్ తో పీకల లోతు ప్రేమలో మునిగిపోయిన అక్కినేని అఖిల్, పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ, నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే కొన్ని వ్యక్తిగత కారణాల దృష్ట్యా పెళ్లి క్యాన్సల్ అయింది.

హిస్టరీ క్రియేట్ చేసిన బాహుబలి 2 :
టాలీవుడ్ ని షేక్ చేసి చరిత్ర తిరగరాసిన సినిమా. తెలుగు లోనే కాదు, ఇండియన్ సినిమా రికార్డులన్నింటిని కొద్దీ రోజుల్లోనే బ్రేక్ చేసిన ఘనత బాహుబలి 2 సాధించింది. అంతేనా, ఆడియన్స్ కి విజువల్ వండర్ రుచి చూపించిన బాహుబలి 2 , ఇప్పట్లో చెరపలేని  రికార్డులు బాలీవుడ్ దిగ్గజాల ముందుంచింది. తెలుగు ఖ్యాతిని మరో మెట్టు ఎక్కించిన రాజమౌళికి  ఈ సందర్బంగా హాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండగలమా?

డ్రగ్స్ కుంభకోణం:
2017 ని కుదిపేసిన అంశాల్లో మొదట ఉండేది డ్రగ్స్ కుంభకోణం. కొందరు టాప్ స్టార్స్, యంగ్ హీరోస్, డైరెక్టర్స్, హీరోయిన్స్ పేర్లు ఈ డ్రగ్స్ రాకెట్ లో వినిపించాయి. అధికారులు పలువురు సెలెబ్రిటీల్ని విచారించడం కూడా జరిగింది. అయితే, అందర్నీ విచారించిన తర్వాత కేస్ విషయం ఏం అయిందో ఎవరికీ తెలియదు.

నాగ చైతన్య సమంత పెళ్లి:
ఏ మాయ చేసావే లో స్క్రీన్ మీద రొమాన్స్ చేస్తూ కనిపించిన నాగ చైతన్య, సమంత... మంచి ఫ్రెండ్స్ గా మారి తర్వాత ఒకరి మాయలో ఒకరు పడ్డారు... అంటే పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిపోయారు. తమ మ్యాజికల్ కెమిస్ట్రీ తో పలు సినిమాల్లో అలరించిన ఈ జంట పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు. అక్కినేని డ్రీం ప్రాజెక్ట్ మనం లో మంచి పాత్ర చేసిన సమంత, పెళ్ళికి ముందు ఆ తర్వాత కూడా మామ నాగార్జున తో శభాష్ అనిపించుకుంది.

ఫిదా చేసిన సాయి పల్లవి:
2017 లో టాలీవుడ్ కి దొరికిన మంచి గిఫ్ట్స్ లో సాయి పల్లవి ఒకరు. ఫిదా తో అందరి మనసులు దోచుకున్న సాయి పల్లవి, అగ్ర దర్శకులు, నిర్మాతల కళ్ళలో పడింది. తెలంగాణ యాసలో అందరినీ ఆకట్టుకున్న సాయి పల్లవిని సావిత్రి, సౌందర్యతో పోల్చింది ఇండస్ట్రీ. చాలా కాలం తర్వాత నటించే నటి దొరికిందనే తృప్తి మిగిల్చింది.

బూతులతో రచ్చ చేసిన అర్జున్ రెడ్డి:
పెళ్లి చూపులు తో ఫస్ట్ సోలో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ, ద్వారక ఫ్లాప్ రిజల్ట్ తో విమర్శలు ఎదురుకొన్నాడు. అయితే, అర్జున్ రెడ్డి తో తన సత్తా ఏంటో చూపించాడు. ఆడియో ఫంక్షన్ వరకు పెద్దగా ప్రాభవం లేకపోయినా, తన స్పీచ్ తో రచ్చ రచ్చ చేసి సినిమా పై క్రేజ్ పెంచాడు విజయ్. సినిమాలో ఉన్న బూతులన్నీ స్టేజి పైనే మాట్లాడి యూత్ ని అట్రాక్ట్ చేసాడు. సినిమాలో కూడా బూతు పాళ్ళు ఎక్కువుండడంతో సూపర్ హిట్టయి కూర్చుంది అర్జున్ రెడ్డి. గొప్ప సినేమానా, రికార్డులు కొట్టిందా అనే డిబేట్ వస్తే టాలీవుడ్ ని షేక్ చేసింది అని మాత్రం చెప్పొచ్చు


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here