English | Telugu

రాజశేఖర్ ని అల్లరిప్రియుడుగా మార్చింది ఆయనే

on Feb 4, 2019

డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ ...ఈ పేరు విన‌గానే మ‌న‌కు గుర్తుకొచ్చేది యాంగ్రీ యంగ్ మేన్  అని.  క్లాస్, మాస్ అని తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే, అభిమానించే  వ‌న్ అండ్ ఓన్లీ హీరో.  `వందేమాతరం` చిత్రంతో న‌టుడుగా ప‌రిచ‌య‌మైన ఈ హీరో తెలుగు, త‌మిళ చిత్రాల‌లో న‌టించి హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని ఏర్ప‌రుచుకున్నాడు.  ఆవేశ పూరిత‌మైన పోలీస్ పాత్ర‌ల్లో రాజ‌శేఖ‌ర్ న‌టించిన‌న్ని సినిమాలు బ‌హుశా ఏ హీరో  న‌టించి ఉండ‌డు.  ప్ర‌తిఘ‌ట‌న‌,  అరుణ‌కిర‌ణం, రేప‌టి పౌరులు చిత్రాల‌లో రాజ‌శేఖ‌ర్ పోషించిన పాత్ర‌లు సామాజిక  స్పృహ‌తో ఉంటూ  అంద‌ర్నీ ఆలోచింప‌జేస్తాయి.     `తలంబ్రాలు, ఆహుతి,  అంకుశం, మ‌గాడు చిత్రాలు రాజ‌శేఖ‌ర్ ను స్టార్ హీరోగా నిల‌బెట్టిన చిత్రాలు అన‌డంలో సందేహం లేదు.  `     సెప్టెంబ‌ర్ 28, 1990లో వ‌చ్చి  సంచ‌ల‌న విజ‌యం సాధించిన `అంకుశం` చిత్రం రాజ‌శేఖ‌ర్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా గా నిలిచింది. రాజ‌శేఖ‌ర్ , జీవిత ఈ చిత్రంలో జంట‌గా న‌టించారు.  న‌టుడు రామిరెడ్డి ఈ చిత్రం ద్వారానే విల‌న్ గా ప‌రిచ‌య‌మ‌య్యాడు.  

ఒక నిజాయితీ ప‌రుడైన ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ అవినీతి ప‌రులైన గూండాల నుంచి ఎలా రాష్ట్రాన్ని కాపాడాడు అన్న కాన్సెప్ట్ తో రూపొందిన ఈచిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది.  ఆ త‌ర్వాత వ‌చ్చిన `మ‌గాడు`  అక్క‌మొగుడు, బ‌ల‌రామ‌కృష్ణులు చిత్రాలు రాజ‌శేఖ‌ర్ కు మంచి పేరు తేగా  కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `అల్ల‌రి ప్రియుడు` చిత్రం రాజ‌శేఖ‌ర్ ను యాంగ్రీయంగ్  మేన్ ని కాస్త అల్ల‌రి ప్రియుడు గా మార్చేసి రాజ‌శేఖ‌ర్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అనేలా అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచిందా చిత్రం. రాజ‌శేఖ‌ర్ ప్ర‌తి సినిమా ఆడియోలు అంద‌ర్నీ ఆక‌ట్టుకునే విధంగా ఉంటాయ‌న‌డంలో సందేహం లేదు.   

అల్ల‌రి ప్రియుడు త‌ర్వాత వ‌చ్చిన కొన్ని చిత్రాలు నిరాశ‌ప‌రిచినా...మా ఆయ‌న బంగారం, మ‌న‌సున్న మ‌హారాజు, మా అన్న‌య్య ,  `ఆయుధం `ఎవ‌డైతే నాకేంటి` చిత్రాలు రాజ‌శేఖ‌ర్ ను స‌క్సెస్ బాట‌లో న‌డిపించాయి.  ఇలా రాజ‌శేఖ‌ర్ గ్రాప్ స‌క్సెస్ , ఫెయిల్యూర్స్ తో ప‌డుతూ , లేస్తూ వ‌చ్చింది. ఇక దాదాపు రాజ‌శేఖర్ కెరీర్ ఎండింగ్ లో ఉందంటోన్న స‌మ‌య‌యంలో `గ‌రుడ‌వేగ‌` చిత్రంతో మ‌ళ్లీ లైమ్ లైట్ లోకి వ‌చ్చాడు రాజ‌శేఖ‌ర్‌. ప్ర‌వీణ్ సత్తార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రంతో మ‌రోసారి రాజ‌శేఖ‌ర్ హీరోగా త‌న స‌త్తా ఏంటో ప్రూవ్ చేసుకుని సినిమాల వేగం పెంచాడు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో స‌రికొత్త క‌థాంశంతో రూపొందుతోన్న `క‌ల్కి` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం ఈ ఏడే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

జీవిత‌, రాజ‌శేఖ‌ర్ ఆద‌ర్శ వివాహం చేసుకుని అంద‌రికీ ఆద‌ర్శ దంప‌తులుగా నిలిచారు. వీరికి శివాని , శివాత్మిక ఇద్ద‌రు కూతుళ్లు. వీరు కూడా  హీరోయిన్స్ గా అరంగేట్రం చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే జీవిత రాజ‌శేఖ‌ర్ లు నిర్మాత‌లుగా మారి సినిమాలు తీసారు. అవి అంత‌గా ఆడ‌లేదు. అయినా ఎన్ని ఒడిదుడుకులు వ‌చ్చినా వాటిని త‌ట్టుకుంటూ సినీ ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ప్ర‌తిభా ని ప్రూవ్ చేసుకుంటూ వ‌స్తోన్న రాజ‌శేఖ‌ర్  (ఫిబ్ర‌వ‌రి 4) ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటోన్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతోంది తెలుగు వ‌న్.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here