గౌతమ్, నంద వేరు కాదు... మరి అసలు మర్మమేంటి
on Jul 22, 2017

ఒక వైపు వరుస ఫ్లాపులు, మరోవైపు విడుదలకి నోచుకోని సినిమాలతో గందరగోళ పరిస్థితులతో సతమతమవుతున్న గోపీచంద్ తన ఆశలన్నీ గౌతమ్ నంద మీదే పెట్టుకున్నాడు. రచ్చ, బెంగాల్ టైగర్ లాంటి మాస్ సినిమాలు తీసిన సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకొని ఈ నెల 28 న విడుదలకి సిద్దమవుతుంది. అయితే, గౌతమ్ నందలో గోపీచంద్ ద్విపాత్రాభినయం చేసాడని ప్రచారం జరుగుతుంది. ప్రమోషనల్ పిక్స్, వీడియోల్లో కూడా గోపీచంద్ రెండు విభిన్న అవతారాల్లో అగుపిస్తున్నాడు.
ఒక రోల్ ధనికుడయితే, ఇంకో రోల్ వీధి కుర్రాడు. కానీ, గోపీచంద్ సినిమాలో ఒకటే క్యారెక్టర్ చేసాడని తెలిసింది. ధనికుడయిన గౌతమ్ అనే ఒక అబ్బాయి, జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు ప్రభావితమై మంచి అనే మార్గాన్ని ఎంచుకొని వీధి కుర్రాడిగా గౌతమ్ నంద గా మారి, తన ఆశయం ఎలా నెరవేర్చుకున్నాడు అనేది కథ. రమణ మహర్షి రచనల స్పూర్తితో ఈ కథని రాసానని దర్శకుడు సంపత్ నంది ఇంతకు ముందే చెప్పిన విషయం తెలిసిందే. గౌతమ్ నంద అందరు అనుకున్నట్టు ఫక్తు కమర్షియల్ సినిమా కాదని, సినిమాలో పెద్ద మెసేజ్ ఉందని అర్ధం అవుతుంది కదా. మంచి హిట్ అయి, గోపీచంద్ కి బ్రేక్ రావాలని కోరుకుందాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



