స్టార్ హీరోలతో పోటీ పడుతున్న విజయ్ దేవరకొండ
on Jun 7, 2018
ఒకప్పుడు సినిమా అంటే స్టార్ హీరో చేశాడా, స్టార్ డైరెక్టర్ చేశాడా అని లెక్కలేస్కోని చూసారు.. కానిప్పుడు ఆ పద్ధతి మారింది.. సినిమా బాగుంటే చాలు ఆదరిస్తున్నారు.. అందుకే చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అవుతున్నాయి.. అలాంటి వాటిల్లో ముందుగా గుర్తొచ్చే సినిమా అర్జున్ రెడ్డి.. ఈ సినిమా ఓ సంచలనం.. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి యూత్ లో బాగా క్రేజ్ వచ్చింది, యాక్టర్ గా కూడా మంచి మర్క్స్ పడ్డాయి.. అందుకే విజయ్ ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోస్ తో పోటీ పడుతున్నాడు.. ఫిలింఫేర్ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ నామినేషన్స్ లో విజయ్ కూడా ఉన్నాడు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో పోటీ పడుతున్నాడు.. ముందు ముందు ఈ యువ సంచలనం ఏ స్థాయికి వెళ్తాడో చూద్దాం...