దిశా ఫేస్ స్వీటు... బాడీ హాట్ అంటున్న డైరెక్టర్
on Jan 23, 2020
వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లోఫర్' సినిమాలో హీరోయిన్ దిశా పటాని గుర్తుందా? ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ, సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. ఇంటర్నెట్ లో దిశా పటాని ఒక సెన్సేషన్. బికినీ లింగరీ ఫోటోలు పోస్ట్ చేయడానికి ఏమాత్రం వెనకాడదు. ఫేమస్ లింగరీ కంపెనీ కెల్విన్ కెవిన్ కి దిశా పటాని బ్రాండ్ అంబాసిడర్ కూడా.
దిశా పటాని పేరు చెబితే ప్రేక్షకులకు గుర్తొచ్చేది హాట్ హాట్ బాడీ. హిందీ డైరెక్టర్ మోహిత్ సూరి కూడా అదే మాట అన్నారు. ఇందులో కొత్తదనం ఏముంది? అంటే... దిశా పటాని ఫేస్ గురించి ఆయన చేసిన కామెంట్. ఆదిత్య రాయ్ కపూర్ దిశా పటాని జంటగా మొహిత్ సూరి దర్శకత్వం వహించిన సినిమా 'మలంగ్'. ఆల్రెడీ సినిమాలో రెండు పాటలు విడుదలయ్యాయి. ఓ పాటలో దిశ అందాలు ఆరబోసింది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ గురించి మోహిత్ సూరి మాట్లాడుతూ "మా సినిమాలో హీరోయిన్ గా అందరికీ నచ్చిన అమ్మాయి కావాలి. అలాగే, అందరికీ తెలిసిన అమ్మాయి అవ్వకూడదు. దిశా పటాని ఇంతకుముందు సినిమాల్లో చిన్నచిన్న రోల్స్ చేసింది. ఆమె అందరికీ నచ్చింది. నటిగా అందరికీ అంతగా తెలియదు. అందుకనే ఆమెను తీసుకున్నా. దిశా పటాని స్వీట్ ఫేస్... హాట్ బాడీ" అన్నాడు. ఫేస్ స్వీట్.. బాడీ హాట్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా.