బన్నీ డ్యాన్స్‌కి బాలీవుడ్ హీరోయిన్ ఫిదా
on Mar 31, 2020
వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'లోఫర్'లో హీరోయిన్ దిశా పాట్నీ గుర్తుందా? ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అందువల్ల, ఆమెను బాలీవుడ్ హీరోయిన్ అనవచ్చు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్స్‌కి దిశా పాట్నీ ఫిదా అయింది. అసలు వివరాల్లోకి వెళితే...
బన్నీ లేటెస్ట్ హిట్ 'అల... వైకుంఠపురములో' సినిమాలో 'బుట్ట బొమ్మ' సాంగ్ ఉంది కదా! అందులో ఏటవాలుగా ఉన్న ర్యాంప్ మీద బన్నీ ఒక స్టెప్ వేస్తాడు. అది దిశా పాట్నీకి బాగా నచ్చింది. దాన్ని సోషల్ మీడియాలో బన్నీకి ట్యాగ్ చేసి ఓ పోస్ట్ చేసింది. "అల్లు అర్జున్... మీరు ఈ స్టెప్ ఎలా వేశారు?" అని అడిగింది. "ఐ లవ్ మ్యూజిక్. నాకు సంగీతం అంటే ఇష్టం. మంచి మ్యూజిక్ నన్ను డాన్స్ చేసేలా చేస్తుంది. థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్" అని అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. "మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నందుకు థాంక్స్" అని దిశా పాట్నీ చెప్పింది. భవిష్యత్తులో వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందంటారా? చూద్దాం!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ అంటే బన్నీ కుమారుడు అయాన్ కి ఎంతో ఇష్టం. ఇటీవల అల్లు అర్జున్ పోస్ట్ చేసిన వీడియో ద్వారా తెలిసింది. టైగర్, దిశా ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. బన్నీ డ్యాన్స్ అంటే దిశా ఇష్టమని చెప్పింది. చూస్తుంటే... బన్నీ ఫ్యామిలీకి టైగర్, దిశా దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read