ప్రామిసింగ్ అనిపిస్తోన్న 'డిస్కో రాజా' టీజర్!
on Dec 6, 2019
మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ 'డిస్కో రాజా'. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి వి.ఐ. ఆనంద్ డైరెక్టర్. ఈ మూవీ టీజర్‌ను శుక్రవారం (డిసెంబర్ 6) యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. సైన్స్ ఫిక్షన్ స్టోరీతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు డైరెక్టర్ చెప్పిన దానికి అనుగుణంగానే టీజర్ ఉంది. ఇండియన్ మెడికల్ రీసెర్చి అసోసియేషన్ వ్యతిరేకించినా విలన్ ఒక మెడికల్ ఎక్స్‌పెరిమెంట్‌కు సిద్ధమవుతాడనీ, ఆ ప్రయోగాన్ని రవితేజపై చేస్తారనీ తెలుస్తోంది. అదివరకే మంచులో అచేతనంగా ఉన్న రవితేజ శరీరాన్ని వాళ్లు తీసుకొచ్చి ప్రయోగం చేస్తారనే అభిప్రాయం కలుగుతుంది. పైగా "వీడైతే నో రికార్డ్స్.. నో రిపోర్ట్స్.. నో రిలెటివ్స్.. జీరో రిస్క్" అని విలన్ చెప్పడం దాన్నే బలపరుస్తోంది. అంటే అనామకంగా అతడి బాడీ వాళ్లకు దొరికిందని ఊహించవచ్చు. ఆ వెంటనే ప్రయోగానికి సిద్ధం చేసిన రవితేజను చూపించారు. "వి ఆర్ గోయింగ్ టు బి గాడ్స్" అని విలన్ చెప్పడాన్ని బట్టి అతని బృందం చేసిన ప్రయోగం సఫలమై రవితేజ బతికాడని అంచనా వేసుకోవచ్చు.
ఈ సినిమాలో ల్యాబ్ సెట్‌ను అన్నపూర్ణ స్టూడియోలోనే వేసి, అక్కడ సన్నివేశాలు తీశారు. టీజర్లో చూపించిన షాట్స్ కొన్ని అక్కడ తీసినవే. మంచు ప్రదేశంలో కనిపించిన సీన్స్ ఐస్లాండ్లో తీసినవి. ఇక రవితేజ రెట్రో గెటప్‌పై ఉన్న యాక్షన్ షాట్స్‌తో టీజర్‌ను ఎండ్ చేశారు. ఈ మూవీలో విలన్‌గా బాబీ సింహా నటిస్తున్నాడు. జనవరి 24న భారీ స్థాయిలో 'డిస్కో రాజా'ను రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత రామ్ తాళ్లూరి చెప్పారు. తమన్ మ్యూజిక్ ఇస్తోన్న ఈ మూవీకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్. అబ్బూరి రవి మాటలు రాయగా నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
Also Read