దిల్ రాజు ఫ్యామిలీలోకి ముగ్గురు అనాథ పిల్లలు!
on Aug 2, 2020
మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనాథ పిల్లలను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు చెందిన మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేరదీసింది. తండ్రి చనిపోయిన కొంత కాలానికే తల్లి కూడా మరణించడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. మనోహర్, లాస్య, యశ్వంత్ అనే ఆ ముగ్గురిని తమ కుటుంబంలోకి ఆనందంగా ఆహ్వానిస్తున్నామని ఆదివారం వెలువరించిన ఒక ప్రకటనలో దిల్ రాజు తెలిపారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడం అత్యంత దయనీయమైన విషయమనీ, ఇప్పటి నుంచీ వారి బాగోగులు చూసుకోనుండటం తనకు ఆనందాన్ని కలిగిస్తోందనీ ఆయన అన్నారు. ఆ పిల్లల విషయాల్ని తన దృష్టికి తీసుకొని వచ్చి, వారికి ఏమైనా సాయం చేయమని సూచించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ పిల్లల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే అవకాశం లభించడం తనకు ఆనందాన్ని కలిగించే విషయమన్నారు. 2018లో తమ కుటుంబం ప్రారంభించిన మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటామని రాజు చెప్పారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
