2017, జనవరి 12న రానున్న గౌతమీపుత్ర శాతకర్ణి.!
on Apr 29, 2016
చాలా కాలం తర్వాత తెలుగు సినీ అభిమానులకు సరైన పోటీని చూసే అవకాశం కలిగింది. చిరు వెర్సస్ బాలయ్య కాంపిటీషన్ ఒకప్పుడు చాలా తీవ్రంగా ఉండేది. ఒకరికి పోటీగా మరొకరు సినిమాలు తీస్తూ, సినిమాల పరంగా పోటీ పడేవారు. 2017 సంక్రాంతి ఇలాంటి రసవత్తరమైన పోటీకి వేడుక కాబోతోంది. మెగా 150 ఫిల్మ్ స్టార్ట్ చేసిన సమయంలో, సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నామని వివివినాయక్ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య కూడా తన శాతకర్ణిని అప్పుడే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. బాలయ్య ఫిక్స్ చేసేయడంతో, జనవరి 12, 2017ను శాతకర్ణి రిలీజ్ డేట్ గా మూవీ టీం ప్రకటించేశారు. దీంతో చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత, తెలుగు ప్రేక్షకులు ఈ ఇద్దరి పోటీని చూడబోతున్నారనమాట. గౌతమీపుత్ర శాతకర్ణిలోని కీలక సన్నివేశాల కోసం బాలయ్య అండ్ కో మే 9 నుంచి మొరాకోలో షూటింగ్ చేయనున్నారు. తల్లి పాత్రకు హేమమాలినిని తీసుకోగా, బాలయ్య సరసన అనుష్క సైన్ చేసిందని సమాచారం. మరో వైపు మెగా 150 కూడా క్యాస్టింగ్ జరుగుతోంది. జూన్ నుంచి చిరు సినిమా కూడా పట్టాలెక్కబోతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
