English | Telugu

చిరంజీవి ఓకే చెప్పేవరకు కథ చెబుతూనే ఉంటా

on Sep 5, 2017


 

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకి దర్శకత్వం వహించడానికి అప్పట్లో వినిపించిన కొన్ని పేర్లలో పూరి జగన్నాధ్ ఒకరు. ఈ సినిమా పేరు ఆటో జానీ అని వార్తలు కూడా వచ్చాయి. అంతా సజావుగా జరుగుతున్న సమయంలో, సెకండ్ హాఫ్ స్టోరీ నచ్చలేదని... అందుకే పూరి ని తప్పిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఆ తర్వాత, చిరంజీవి 150 వ చిత్రాన్ని దర్శకత్వం వహించే అదృష్టం వి వి వినాయక్ ని వరించింది. ఒక టీవీ ప్రోగ్రాం కి అతిధిగా వచ్చిన పూరి జగన్నాధ్ అసలు చిరంజీవి సినిమా ఎందుకో మిస్ అయిందో వివరించారు. చిరుకి ఎవరో 150 వ సినిమాకి అలాంటి కథ వద్దని చెప్పారట... అందుకే ఏదో చిన్న సాకు చెప్పి పూరీని వదిలించుకున్నారట. అయితే, ఈ మధ్యే తన అభిమాన నటుడయిన చిరుని కలిసి ఒక కొత్త కథ చెబితే ఆయనకి నచ్చిందట. ఒక వేళ, ఆ కథ కూడా నచ్చకపోతే, ఇంకో కథ వినిపిస్తాడట. అలా చిరు మెప్పు పొందే వరకు కథలు చెబుతూనే ఉంటాడట. ప్రస్తుతం తన కొడుకు ఆకాష్ ని హీరో గా లాంచ్ చేసే సినిమాకి కథ సమకూరుస్తున్నాడట. త్వరలో మొదలవనున్న ఈ సినిమా తర్వాత మళ్ళీ చిరు ని కలుస్తానని చెప్పాడు. బాలకృష్ణ నటించిన పైసా వసూల్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోవడంతో... ఆకాష్ సినిమాతో తనని తాను నిరూపించుకుంటే తప్ప పూరి కి మరో పెద్ద సినిమా దక్కే అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు!

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here