బన్నీతో.. కొరటాల మూవీ?
on Jun 13, 2018
వరుస హిట్లతో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ, తర్వాతి సినిమా ఏ హీరోతో ఉండబోతుంది? అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మొన్న ఆ మధ్య కొరటాల డైరెక్షన్లో మెగాస్టార్ అంటూ వార్తలొచ్చాయి.. అయితే మెగాస్టార్ మూవీ కన్నా ముందు కొరటాల, బన్నీతో ఓ మూవీ చేయబోతున్నాడంటూ ఇప్పుడొక వార్త బయటికొచ్చింది.. 'నా పేరు సూర్య' తో ప్లాప్ అందుకున్న బన్నీ కొరటాలతో కలిసి మంచి హిట్ ఇవ్వాలని చూస్తున్నాడట.. చూద్దాం మరి ఏం జరుగుతుందో.