బర్త్‌డే ట్రీట్.. 'అంజలి అంజలి' కవర్ సాంగ్‌తో వస్తున్న అల్లు అర్హ!
on Nov 20, 2020
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హ.. ఇద్దరికిద్దరూ పిడుగులే. చిన్నతనంలోనే వాళ్లు తమ చేష్టలతో, తమ టాలెంట్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూ వస్తున్నారు. బన్నీ కెరీర్ బెస్ట్ బ్లాక్‌బస్టర్ 'అల.. వైకుంఠపురములో' మూవీలోని "ఓ మై గాడ్ డాడీ" సాంగ్ టీజర్‌లో అయాన్, అర్హ నటించి మనల్ని అలరించారు. ఇప్పుడు తన నాలుగో బర్త్‌డే సందర్భంగా "అంజలి.. అంజలి" కవర్ సాంగ్‌తో మనల్నందరినీ తన బుట్టలో పడేసుకోడానికి రెడీ అయ్యింది అర్హ.
అవును. మణిరత్నం క్లాసిక్ ఫిల్మ్ 'అంజలి'లో బేబి షామిలి నటించిన "అంజలి.. అంజలి" సాంగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఆ పాటను ఇప్పుడు కవర్ సాంగ్‌గా తన క్యూట్ మూమెంట్స్‌తో అర్హ మనముందు ఆవిష్కరించనుంది. శనివారం అంటే నవంబర్ 21 అర్హ పుట్టిన రోజు. ఉదయం 11 గంటలకు ఫ్యాన్స్‌కు సంబరాన్ని కలిగిస్తూ ఆ సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. మహమ్మారి కారణంగా అర్హ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను హంగామా లేకుండా చేస్తున్నారు.
తెలుగు చిత్రసీమలోని అందమైన జంటల్లో ఒకటిగా పేరు పొందిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి మొదట ప్రేమలో పడి, ఆ తర్వాత 2011 మార్చి 6న పెళ్లి చేసుకున్నారు. 2014 ఏప్రిల్ 3న కుమారుడు అయాన్ పుట్టగా, రెండో బిడ్డగా అర్హ 2016 నవంబర్ 21న పుట్టింది. ఇద్దరూ తమ చేష్టలతో ఫ్యాన్స్‌కు ముచ్చటగొలుపుతూ వస్తున్నారు. ఇప్పుడు అర్హ "అంజలి అంజలి" కవర్ సాంగ్ ద్వారా మన ముందుకు రాబోతోంది. ఫ్యాన్స్ ఎప్పుడు శనివారం ఉదయం 11 గంటలవుతుందా అని ఇప్పట్నుంచే ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
