English | Telugu

బిగ్ బాస్ 3 ఫైనల్ లిస్ట్ లీక్ చేసిన నూతన్ నాయుడు...నిజమేనా !

on Jul 19, 2019

 

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ షో మూడో సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. హౌస్‌లోకి వెళ్లబోయేది ఎవరన్నది ఇప్పటి వరకు మా టీవీ, బిగ్ బాస్ యాజమాన్యం సస్పెన్స్ కొనసాగిస్తోంది. కొంతమంది పేర్లు బయటకు వచ్చినా అది నిజమో కాదో తెలీక సస్పెన్స్ అలాగే కొనసాగిస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ షోలో పాల్గొనబోయేది వీరేనంటూ గత సీజన్ లో కామన్ మ్యాన్ గా పార్టిసిపేట్ చేసిన నూతన్ నాయుడు వెల్లడించాడు. బిగ్‌బాస్ షో పోటీదారులు వీరేనంటూ 15 మంది పేర్లను లీక్ చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.  

నూతన్ నాయుడు వెల్లడించిన ఆ 15 మంది సెలబ్రిటీలు ఎవరంటే నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, నటుడు వరుణ్ సందేశ్-వితికా షెరు(జంట), సీరియల్ నటుడు రవికృష్ణ, సీరియల్ యాక్టర్ అలీ రెజా, టీవీ9 న్యూస్ యాంకర్ జాఫర్, నటి పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేశ్, సీరియల్ నటి రోహిణి, డబ్‌స్మాష్ స్టార్ అశు రెడ్డి(సమంతా డూప్) ఉన్నారు.  ఈ జాబితా తనకు ఎలా వచ్చిందీ అంటే సీక్రెట్ అంటున్న నూతన్ నాయుడు రెండు రోజులు ఓపిక పడితే తను చెప్పింది నిజమే అని మీరే ఒప్పుకుంటారంరని అంటున్నాడు నూతన్ నాయుడు. చూద్దాం ఎంతవరకూ నిజం అవుతుందో ?


Cinema Galleries



Latest News


Video-Gossips