తూచ్ ... మీరు ఆట సీరియస్ గా ఆడాలనే అంటూ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున
on Sep 21, 2020
తూచ్ ... మీరు ఆట సీరియస్ గా ఆడాలనే అంటూ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున రెండో ఎలిమినేటర్ పై చివరి వరకు సాగిన ఉత్కంఠ బిగ్ హౌస్ డోర్ దాక వెళ్ళి వెనుతిరిగిన దేత్తడి హారిక దేత్తడి కోసం ఇంటి సభ్యుల కంటతడికి కరిగిపోయిన నాగ్ వచ్చేవారం ఎలిమినేషన్ లో నాగవల్లి దేవి ని చేర్చిన కళ్యాణి
పోతూపోతూ కూడా దేవిపై కళ్యాణి కసి చూపించింది బిగ్ బాస్ 4 సీజన్ వీకెండ్ సన్ డే ఎపిసోడ్ ఫన్ గా సాగింది. ఈ వారం హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున పేల్చిన బాంబు తుస్సుమంది. రెండు రోజులుగా ఎలిమినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ల లో, టీవీల ముందుఉన్న ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించినప్పటికీ చివరకు కరాటే కళ్యాణి ఒక్కరే రెండోవారం ఇంటిదారి పట్టారు. దాంతో నాగార్జున ఇంటి సభ్యులతో భలే గేమ్ ఆడుతున్నారు అనిపించింది. మొదటివారం మీలో కట్టప్ప ఉన్నాడు అంటూ కంటెస్టెంట్ల మధ్య టాస్క్ లు ఇచ్చి చివరికి తూచ్ కట్టప్ప ఎవరూ లేరు అంటూ తేల్చి చెప్పారు.
ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పి.. చివరికి తూచ్ మీరు ఆట సీరియస్ గా ఆడాలనే అంటూ జోక్ చేశారు. దాంతో కంటెస్టెంట్లు అంతా ఊపిరి పీల్చుకున్నా ప్రేక్షకులు మాత్రం ఇంటి సభ్యులతో నాగార్జున భలే గేమ్ ఆడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన కళ్యాణి నాగార్జున తో కలిసి స్టేజ్ పై ఈ రెండువారాలు బిగ్ హౌస్ లో తన రోల్ రీప్లే చూసింది. హౌస్ లో తాను ఉండలేకపోయానని అందుకే తాను సెల్ప్ నామినేట్ అయ్యాను అంది. హౌస్ నుంచి వెళ్ళిపోతున్న ఆమెకు నాగార్జున ఇచ్చిన టాస్క్ లో భాగంగా బిగ్ హౌస్ కంటెస్టెంట్లలో టాప్ 5, బాటమ్ 5 వారి ఫొటోలను బోర్డ్ పై అమర్చింది. టాప్ 5గా హారిక, అమ్మ రాజశేఖర్, మోనాల్, దివి, అభిజిత్ ఫొటోలను, బాటమ్ ఫైవ్ గా గంగవ్వ, కుమార్ సాయి, అరియానా, సుజాత, సోహైల్ ఫొటోలను పెట్టింది. దేవి బ్రిలియంట్, అవినాష్- అమాయక చక్రవర్తి, మెహబూబ్- ఇంటిలిజెంట్, లాస్య - ఇన్నోసెంట్,అఖిల్‌కు కోపమెక్కువని చెప్పింది.హౌస్‌లో కట్టప్పలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు అంటూ కామెంట్ చేసింది. వచ్చేవారం ఎలిమినేషన్ లో దేవి నాగవల్లిని చేర్చుతూ బిగ్ బాంబ్ వేసింది. స్టేజీపై రాగయుక్తంగా కళ్యాణి చెప్పిన డైలాగ్స్, ఆమె ఫర్మామెన్స్ తో నాగార్జున ఆశ్చర్యపోయాడు. ఆమెను అభినందిస్తూ షో నుంచి వీడ్కోలు చెప్పారు.
ఇక రెండో ఎలిమినేటర్ ఎవరూ అని చెప్పడానికి ముందు కంటెస్టెంట్లకు ఫన్నీ టాస్క్ లు ఇచ్చారు. నామినేషన్ లో ఉన్న ఏడుగురు సభ్యుల అదృష్టాన్ని బెలూన్స్ తో పరీక్షించారు. ఈ టాస్క్ లో అభిజితి , కుమార్ సాయి సేఫ్అయ్యారు. దాంతో అప్పటివరకు నెక్ట్స్ ఎలిమినేటర్ కుమార్ సాయి అనుకున్నవారి అంచనా తప్పింది. ఆ తర్వాత బోస్ రింగ్ గేమ్ టాస్క్ ఇచ్చారు. ఇంటి సభ్యుల జంటలు ఆడిన ఈ గేమ్ లో అఖిల్ గెలవగా ఓడిపోయిన అభిజిత్ పుషప్స్ చేశాడు. గెలిచిన మోనాల్‌ను ఓడిపోయిన హారిక నోరు మూయకుండా పొగిడింది. మెహబూబ్ గెలవగా ఓడిన సోహైల్ పచ్చి ఉల్లిపాయ తిన్నాడు. నాగవల్లి దేవి గెలిస్తే ఓడిపోయిన అమ్మ రాజశేఖర్ పచ్చి మిర్చి కరకరా నమిలేశాడు. సుజాత గెలవగా, ఓడిన లాస్య చిన్నపిల్లలా మారాం చేసింది. దివి గెలిస్తే ఓడిపోయిన అరియానా పోల్ డ్యాన్స్ చేసింది. గంగవ్వ గెలవగా, ఓడిన కుమార్ సాయి నోట్లో నీళ్లు పోసుకుని పాట పాడేందుకు ప్రయత్నించాడు. అవినాష్ గెలిచి ఓడిపోయిన నోయల్‌కు లిప్‌స్టిక్ రుద్దాడు. ఈ టాస్స్ లో గంగవ్వ, కుమార్ సాయి తో పోటీ పడి మరీ గెలిచింది. చాలా హుషారుగా హౌస్ లో గంగవ్వ టాస్క్ పూర్తి చేసింది. రాజశేఖర్ సేఫ్ అని నాగార్జున ప్రకటించారు.
ఇక ఎలిమినేషన్ నుంచి సోహైల్, నోయల్ సేఫ్ అని దేవి రాజపత్రం చదివి వినిపించింది. దాంతో ఫైనల్ గా హారిక, మోనాల్ మిగిలిపోయారు. అయితే ఈ రోజు హౌస్ నుంచి హారిక ఎలిమినేట్ అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమెను ఎలిమినేట్ చేసి ఆ తర్వాత సీక్రెట్ రూంలో ఉంచి టాస్క్ లు ఇచ్చి ఆ తర్వాత తిరిగి బిగ్ హౌస్ లోకి తీసుకువస్తారని రకరకాల కథనాలు వచ్చాయి. దాంతో ప్రేక్షకులు హారిక ఎలిమినేట్ అని డిసైడ్ అయ్యారు. ఇంటి సభ్యులకు మరో టాస్క్ ఇచ్చారు. నామినేషన్లో లేని ఏడుగురిలో హారిక ఎలిమినేట్ కావాలని అఖిల్, మెహబూబ్, లాస్య హారిక ముందున్న నీటిని జార్ లో పోశారు. మోనాల్ ఎలిమినేట్ కావాలంటూ దేవి, అరియానా, దివి మోనాల్ ముందున్న నీటిని జార్ లో పోశారు. ఇద్దరూ సమానం కావడంతో చివరగా సుజాత ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. దాంతో ఆమె మోనాల్ వైపు మొగ్గు చూపడంతో మెజారిటీ ప్రకారం హారిక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పాడు.
ఇంటి సభ్యులు ఆమెకు వీడ్కోలు చెప్తూ గేట్ దగ్గరకు వెళ్లారు. హారిక అందరికీ గుడ్‌బై చెప్పింది. సరిగ్గా అదే సమయంలో హారికను బిగ్ హౌస్ లోకి రావాలని ఆదేశించారు. దాంతో అభిజిత్, నోయల్ హారికను చేతులపై ఎత్తుకుని హౌస్ లోకి తీసుకువచ్చారు. దేత్తడి కోసం హౌస్ మేట్స్ అంతా కంట తడి పెట్టుకుంటున్నారని అంటూ ఎలిమినేషన్ ను సీరియస్ గా తీసుకుంటూ ఆట ఆడండి. ఇకపై సెల్ఫ్ నామినేషన్లు ఉండవు అని చెప్పడానికే ఇదంతా అంటూ డబుల్ ఎలిమినేషన్ ఫేక్ అని తేల్చారు. దాంతో రెండోవారం బిగ్ బాస్ 4 సీజన్ వీకెండ్ ఫన్ కు తెరపడింది. మొదటివారం కట్టప్ప అంటూ, రెండో వారు డబుల్ ఎలిమినేషన్ అంటూ ఉత్కంఠను రేకెత్తించి చివరికి అంతా ఉత్తిత్తునే అన్నాడు నాగార్జున. మరి మూడోవారంలో ఏం ముచ్చట తీసుకువస్తాడో చూడాలి.
Also Read