English | Telugu

భ‌ర‌త్ అనే నేను హైలెట్స్ ఇవే!!

on Apr 16, 2018


మ‌హేష్ సినిమా వ‌స్తుందంటేనే బాక్సాఫీసు ద‌గ్గ‌ర అటెన్ష‌న్ మొద‌లైపోతుంది. కొత్త రికార్డులు లిఖించ‌డానికి ఇంత‌కు మించిన త‌రుణం మ‌రోటి ఉండ‌దు. మ‌హేష్ సినిమా ఎలా ఉండ‌బోతోంది?  అందులోని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌లేంటి?  అనే విష‌యాల‌పై చ‌ర్చ సాగుతూ ఉంటుంది. భ‌ర‌త్ అనే నేను హైలెట్స్ ఏంటో ఇప్పుడు తెలిసిపోయాయి. ఆల్రెడీ ఈ సినిమాకి సెన్సార్ జ‌రిగిపోయింది. సెన్సార్ బృందం యూ బై ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చింది. అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం భ‌ర‌త్ హైలెట్స్ ఇవే.

* భ‌ర‌త్ అనే నేను ఓ యువ ముఖ్య‌మంత్రి క‌థ‌. భ‌ర‌త్ అనే యువ‌కుడు ముఖ్య‌మంత్రి అవ్వ‌డానికి దారి తీసిన ప‌రిస్థితులు చాలా ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటాయ‌ట‌. ఈ సినిమాకి అదే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని తెలుస్తుంది.

* విద్యావ్య‌వ‌స్థ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ప్ర‌స్తుత విద్యా విధానంపై ఈ సినిమాలో లేవ‌నెత్తిన అంశాలు ఆలోచింప‌జేసేవిగా ఉంటాయ‌ని తెలిసింది. అక్క‌డ మ‌హేష్ చెప్పే డైలాగులు క్లాప్స్ కొట్టించేలా ఉంటాయ‌ట‌.

* ద్వితీయార్థంలో మూడు ఎమోష‌న‌ల్ సీన్లు ఉంటాయ‌ని, సెకండాఫ్ రేంజ్ పెంచ‌డానికి ఆ మూడు సీన్లూ దోహ‌ద ప‌డ‌తాయ‌ని తెలుస్తోంది.

* మిర్చి, శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్‌.. సినిమాలు సూప‌ర్ హిట్టైనా, అందులో క్లైమాక్స్ మాత్రం చాలా వీక్‌. అయితే ఈసారి భ‌ర‌త్ అనే నేను క్ల‌యిమాక్స్‌లో అలాంటి పొర‌పాటు జ‌ర‌క్కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడ‌ట కొర‌టాల‌. క్లైమాక్స్ చాల ఉద్వేగంగా సాగుతుంద‌ని, ఈనాటి యువ‌త‌రానికి గొప్ప సందేశం అందించాడ‌ని, రాజ‌కీయాలు ప్ర‌క్షాళ‌న చేయాలంటే ఏం జ‌ర‌గాలో ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా వివ‌రించాడ‌ని తెలుస్తోంది. ఇవ‌న్నీ వ‌ర్క‌వుట్ అయితే శ్రీ‌మంతుడు రికార్డుల‌ను సైతం భ‌ర‌త్ తిర‌గ‌రాసే అవ‌కాశం ఉంది. 


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here