నమ్మండి.. నమ్మకపోండి.. 'కొబ్బరిమట్ట'కు బెనిఫిట్ షో!
on Aug 8, 2019
సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయం చేసిన 'కొబ్బరిమట్ట' సినిమా ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రూపక్ రోనాల్డ్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని సాయిరాజేశ్ నిర్మించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూడేళ్ల పాటు నిర్మాణంలో ఉన్న ఈ మూవీ ఎట్టకేలకు ఇప్పుడు విడుదలవుతోంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయమేమంటే ఈ సినిమాకు బెనిఫిట్ షో పడుతుండటం.
ప్రొద్దుటూరులోని సినీహబ్ స్క్రీన్‌లో ఆగస్ట్ 10 ఉదయం 5 గంటలకు షో వేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత, రచయిత సాయిరాజేశ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. "కొద్దిగా అతి అయినా ఇది నిజం.. సారీ.. కొద్దిగా కాదు చాలా అతి అయినా ఇది నిజం. ప్రొద్దుటూరు సినీహబ్లో ఉదయం 5 గంటల షో. డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడే ఫోన్‌చేసి చెప్పారు" అని ఆయన పోస్ట్ చేశారు. కాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో 8.45 షోకి అన్ని టికెట్లు అమ్ముడవడంతో అదే టైంకి మరో షో కూడా జోడించడం 'కొబ్బరిమట్ట'పై ప్రేక్షకుల ఆసక్తి ఎలా ఉందో తెలియజేస్తోంది.
రెండు రోజుల క్రితం విడుదల చేసిన ట్రైలర్లో సంపూర్ణేష్ బాబు చేసిన విన్యాసాలు కడుపుబ్బ నవిస్తున్నాయి. ట్రైలరే ఇలా ఉంటే, ఇక సినిమా మొత్తం ఎంతగా నవ్విస్తుందోననే అభిప్రాయం జనంలో వ్యక్తమవుతోంది. 'హృదయ కాలేయం'తో బర్నింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు 'కొబ్బరిమట్ట'తో మరోసారి మ్యాజిక్ చేస్తాడా? లేక ఒన్ ఫిల్మ్ వండర్‌గా మిగిలిపోతాడా? చూడాలి.