బెల్లంకొండ సురేశ్ పై కేసు నమోదు!
on Aug 3, 2017

బెల్లంకొండ సురేశ్ అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారాయన. ప్రస్తుత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో బెల్లంకొండ సురేశ్ పై కేసు నమోదైంది. ఫిర్యాదు దారులపై బెల్లంకొండ కూడా కేసుపెట్టారు. వివరాల్లోకెళ్తే...
తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకునిగా రూపొందుతున్న ‘జయ జానకీ నాయక’చిత్రం పాట విషయంలో ఈ వివాదం మొదలైంది. ఆ పాటకు సంబంధించిన సెట్టింగ్ లో లైట్లను అమర్చడానికి ఓ వ్యక్తితో 2.75 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు బెల్లంకొండ వాదన. దానికి తగ్గట్టే అతనికి చెల్లించానని ఆయన తెలిపారు. అయితే.. సంబంధంలేని అశోక్ రెడ్డి అనే వ్యక్తి వచ్చి ఆ కాంట్రాక్ట్ తనదనీ... 10.75 లక్షలు చెల్లించాలనీ తనపై వత్తిడి తెస్తున్నాడనీ... ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నాడనీ బెల్లంకొండ కేస్ లో పేర్కొన్నారు.
లైట్లు అమర్చినందుకు గాను తనకు 10.75 లక్షలు బెల్లంకొండ సురేశ్ చెల్లించాల్సి ఉందనీ.. అశోక్ రెడ్డి అనే వ్యక్తి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. ఈ రెండు కేసుల విషయంలో ప్రస్తుతం పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇందులో నిజానిజాలు తేలాల్సివుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



