తుఫాను బాధితులకు నందమూరి బాలయ్య అండ
on Oct 15, 2014
.jpg)
హుదూద్ తుఫాను బాధితులకు సహాయం అందించేందుకు మానవతా దృక్ఫధంతో సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. చిత్ర పరిశ్రమలో నిన్నటి నుంచి ప్రార౦భమైన విరాళాల వెల్లువ కొనసాగుతోంది. నిన్న పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు విరాళాలు ప్రకటించగా, లేటెస్ట్ గా వీరి జాబితాలో నందమూరి బాలకృష్ణ కూడా చేరిపోయారు. బాలయ్య ఈరోజు ఉదయం తుఫాను బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 30లక్షల ఆర్ధిక సహాయతో పాటు, 20 టన్నుల బియ్యం మరియు అస్వస్థతకు గురైన వారికి అవరసమైన మందులును కూడా అందించేందుకు పంపించారు. తుఫాను బాధితులకు వివిధ సంస్థలు పెద్దమొత్తంలో విరాళాలతో ముందుకొస్తున్నాయి. ప్రధానంగా సినీ పరిశ్రమ విరాళాలతో ముందుండడం అభినందనీయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



