బాహుబలి-2లో అనుష్క ఒక్కరోజు ఖర్చు ఎంతో తెలుసా..?
on May 2, 2017
.jpg)
ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన బాహుబలి ద కన్‌క్లూజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో భాగాన్ని జనం చూడాలనుకున్న మెయిన్ రీజన్ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలనే..దానితో పాటు తొలి భాగంలో వృద్ధురాలిగా అనుష్కను చూడలేకపోయిన అభిమానులు..రెండో భాగంలో యంగ్ దేవసేన ఎలా ఉందో చూడాలనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అనుష్క క్యారెక్టర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాడు జక్కన్న. యువరాణిగా స్వీటీ చేసిన విన్యాసాలు థియేటర్లో ఆడియన్స్ చేత ఈలలు వేయించాయి. అంతా బాగానే ఉంది కానీ..అనుష్క పాత్రకు చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చిందట.
బాహుబలి-1 పూర్తయి..కన్‌క్లూజన్ పట్టాలెక్కే గ్యాప్‌లో స్వీటీ సైజ్ జీరో అనే మూవీ చేసింది. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం సుమారు 20 నుంచి 25 కేజీలు బరువు పెరిగింది అనుష్క. అంత కష్టపడ్డప్పటికీ ఆ సినిమా బొల్తా కొట్టింది. ఆ డిజాస్టర్ నుంచి కోలుకుని బాహుబలి-2 షూటింగ్‌లో పాల్గొంది అనుష్క. లావుగా ఉన్న అనుష్కను చూసిన రాజమౌళీ ఆమెకు క్లాస్ పీకాడట. ఎందుకంటే యువరాణి పాత్రలో ఆమె యుద్ద సన్నివేశాల్లో పాల్గొనాల్సి ఉంది.
బొద్దుగా ఉన్న బొమ్మాళీ ఆ సన్నివేశాల్లో నటించడం కష్టం. అందుకే ఆమెను బరువు తగ్గాల్సిందిగా సూచించాడు జక్కన్న. తిరిగి సన్నబడటానికి ఎంతగా వర్కవుట్లు చేసినా..సైకిల్ మీద ప్రతీ రోజు భాగ్యనగరం మొత్తం చుట్టినా ఫలితం శూన్యం. దీంతో చేసేది లేక అనుష్కతో అలాగే షూట్ కంప్లీట్ చేశాడు రాజమౌళి. అయితే ఎడిటింగ్ టైంలో ఆమెను సన్నగా చూపించడం కోసం అదనంగా సీజీ వర్క్ అవసరమైంది. దీంతో ఒక్కో ఫ్రేమ్‌కు 70 వేలు ఖర్చు చేసి మరీ సీజీ వర్క్ చేయించాడు రాజమౌళి. వారి కష్టం వృథా కాకుండా సినిమాలో అనుష్క చాలా అందంగా కనిపించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



