బాహుబలి 3 గురించి నోరు విప్పిన రాజమౌళి
on May 4, 2017

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి ని మొదట ఒకే భాగంగా తీద్దామని అనుకున్నాడు. కానీ, లెన్త్ ఎక్కువవడంతో, రెండు పార్ట్ లుగా తీయడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. రెండు సంవత్సరాల్లో తీద్దామనుకున్న సినిమా కాస్త ఐదు సంవత్సరాలు పట్టింది. బాహుబలి లో కనీసం ఒక్క పాత్రయినా చేయాలి అని స్టార్ హీరోలు సైతం అనుకున్న తరుణంలో, ఒళ్ళు దాదాపు పులిసి పోయి కళ్ళు లొట్టపోయినంత పని అయింది ప్రభాస్, రానా మరియు ఇంక ఇతర ఆర్టిస్ట్ లకి. దాదాపు అందరు హమ్మయ్య అనుకొని ఉంటారు షూటింగ్ చివరి రోజు, అంత కష్ట పడ్డారు మరి! అందరి కష్టానికి ఫలితంగా బాహుబలి 2 రికార్డులు తిరగ రాస్తుంది.
ప్రస్తుతం, బాహుబలి కోర్ టీం ప్రమోషన్లో భాగంగా లండన్ లో ఉన్నారు. అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ, బాహుబలి 3 లేదు అని చెప్పలేనని... ఒక వేళ తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి కథతో వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పారు. అయితే, బాహుబలి లో సొంత కుటుంబంలో వ్యతిరేకులందరు చనిపోవడంతో కొత్త థ్రెడ్ అల్లుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే, రాజమౌళి కి కానీ, బాహుబలి లో నటించిన ఆర్టిస్టులకి గాని, ఇప్పటికిప్పుడు పార్ట్-3 చేసే ఆలోచనలు లేవు. ఒక వేళ విజయేంద్ర ప్రసాద్ మంచి కథ చేసిన అది కార్యరూపం దాల్చడానికి ఎంత కాదన్న 2 సంవత్సరాలు పట్టొచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



