ఆ సినిమా వచ్చి ‘అర్జున్ రెడ్డి’ ని ట్రెండ్సెట్టర్ని చేసింది!
on Feb 12, 2018
‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చినప్పుడు... కుర్రాళ్లందరూ... ఆవేశంతో ఊగిపోయారు. దాన్నో ‘ట్రెండ్ సెట్టర్’ అన్నారు. ఇంకో అడుగు ముందుకేసి... ‘అర్జున్ రెడ్డి’ని మరో ‘శివ’గా అభివర్ణించారు. అనుకున్నట్టే సినిమా బాగా ఆడింది. డబ్బులొచ్చాయ్. అయితే... అనుకున్నది మాత్రం జరగలేదు. ‘అర్జున్ రెడ్డి’ మార్క్ సినిమాలేం తర్వాత రాలేదు. ఈ పరిణామం ‘అర్జున్ రెడ్డి’ అభిమానులను బాగానే వేధించింది. ఆ మధ్య ఒకట్రెండు సినిమాల పోస్టర్లు మాత్రం ‘అర్జున్ రెడ్డి’ని అనుసరించాయ్. కథా, కథనాల పరంగా మాత్రం ‘అర్జున్ రెడ్డి’ని ఇప్పటివరకూ ఎవరూ ఫాలో అవ్వలేదు.
అని మీరనుకుంటే నిజంగా పప్పులో కాలేసినట్టే ! ఎందుకంటే... అసలు అనుమానమే రాకుండా ‘అర్జున్ రెడ్డి’ నే అనుసరిస్తూ, రీసెంట్ గా ఓ సినిమా వచ్చింది. రావడమే కాదండోయ్.. హిట్టు కూడా పట్టేసింది. ఇంతకీ ఏంటాసినిమా? అనేగా మీ డౌట్! సరే... సూటిగా విషయంలోకెళిపోదాం.
‘అర్జున్ రెడ్డి’ తరహా కథతోనే... దాదాపు అవే కేరక్టరైజేషన్లతో వచ్చి.. హిట్ కొట్టిన ఆ సినిమా ఏదో కాదు. వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’. అవును.. నిశితంగా పరిశీలించి చూడండి. ఆ రెండు సినిమాల్లో ఎంత పోలిక ఉందో మీకే అర్థమవుతుంది. మచ్చుకు కొన్ని పోలికల గురించి సరదాగా ముచ్చటించుకుందాం.
1. ‘అర్జున్ రెడ్డి’లో హీరో ఫస్ట్ లుక్ లోనే హీరోయిన్ ని ప్రేమించేస్తాడు. ‘తొలి ప్రేమ’లో కూడా తొలి చూపులోనే లవ్ చేసేస్తాడు.
2. ‘అర్జున్ రెడ్డి’ కథానాయకుడికి ముక్కుమీదే కోపం. ‘తొలి ప్రేమ’లో హీరో కూడా కోపిష్టే.
3. ‘అర్జున్ రెడ్డి’లో తొందరపాటు తనం.. అభిప్రాయ బేధాల వల్ల.. హీరోహీరోయిన్లు విడిపోతారు. ‘తొలి ప్రేమ’లో కూడా సేమ్ టు సేమ్.
4. సుదీర్ఘ విరామం తర్వాత ‘అర్జున్ రెడ్డి’లో హీరోహీరోయిన్లు కలుస్తారు. ‘తొలి ప్రేమ’లో కూడా అంతే.
5. ‘అర్జున్ రెడ్డి’లో లిప్ లాక్ లు కోకొల్లలు. ‘తొలి ప్రేమ’లో కూడా లిప్ లాక్ లకు కొదవలేదు.
6. అటు ‘అర్జున్ రెడ్డి’లోనూ ఇటు ‘తొలి ప్రేమ’లోనూ కార్లో రొమాన్స్... సేమ్ టూ సేమ్.
మరిచిపోయా.... ‘అర్జున్ రెడ్డి’లో హీరో హైలీ ఎడ్యుకేటెడ్. ‘తొలి ప్రేమ’లో హీరో కూడా హైలీ ఎడ్యుకేటెడే.
రెండు సినిమాల్లోనూ హీరోల వల్ల హీరోయిన్లు సఫర్ అవుతారు.
సో.. ఇందుమూలంగా మేం చెప్పొచ్చేదేంటంటే... మీరనుకున్నట్టుగానే... ‘అర్జున్ రెడ్డి’ ట్రెండ్ లో ఎట్టకేలకు ఓ సినిమా వచ్చిందన్నమాట. ఇంకా ఈ లైన్లో ఇంకెన్ని సినిమాలొస్తాయో చూడాలి. ఏమంటారు ఫ్రెండ్స్.