English | Telugu

ప్ర‌ఖ్యాత దేవ‌దాసి పాత్ర‌లో అనుష్క?

on Mar 22, 2020

 

ప్ర‌ఖ్యాత క‌ర్ణాట‌క విద్వాంసురాలు, సాంస్కృతిక కార్య‌క‌ర్త‌, ప‌రిశోధ‌కురాలు, దేవ‌దాసి అయిన బెంగుళూరు నాగ‌ర‌త్న‌మ్మ పాత్ర‌ను అనుష్క పోషించ‌నున్న‌దా?  ప్ర‌స్తుతం ఈ ప్ర‌చారం ఇంట‌ర్నెట్‌లో జోరుగా న‌డుస్తోంది. క‌ర్ణాట‌క విద్వాంసుడు త్యాగ‌రాజుకు గుడి క‌ట్టి, త్యాగ‌రాజ ఆరాధ‌నోత్స‌వాలు ప్రారంభించ‌డంలో ప్ర‌ముఖ పాత్ర వ‌హించిన విదుషీమ‌ణిగా నాగ‌ర‌త్న‌మ్మ కీర్తి గ‌డించారు. ఆమె బ‌యోపిక్‌ను రూపొందించ‌డానికి లెజెండ‌రీ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీ‌నివాస‌రావు ప్ర‌య‌త్నిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ అధినేత టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఆ పాత్ర‌ను చేయ‌గ‌ల న‌టికోసం సింగీతం చేస్తున్న అన్వేష‌ణ అనుష్క వ‌ద్ద ఆగింద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు చెప్పుకుంటున్నారు. నాగ‌ర‌త్న‌మ్మ పాత్ర‌ను అనుష్క కంటే గొప్ప‌గా పోషించ‌గ‌ల న‌టి మ‌రొక‌రు లేర‌ని ఆయ‌న భావిస్తున్నార‌నీ, త్వ‌ర‌లోనే ఆమెను క‌లిసి స్క్రిప్టు వినిపించ‌డానికి సింగీతం సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. నాగ‌ర‌త్న‌మ్మ జీవితంలో అనేక పార్శ్వాలున్నాయ‌నీ, స్వ‌యంగా దేవ‌దాసి అయిన ఆమె, ఆ వ్య‌వ‌స్థ‌ను రూపుమాప‌డానికి చేసిన కృషి, దాని కోసం ఆమె ఎదుర్కొన్న అడ్డంకులు, ప‌డ్డ బాధ‌లు అన్నీ ఇన్నీ కావ‌నీ, అలాంటి పాత్ర‌కు అనుష్క అయితేనే న్యాయం చేయ‌గ‌ల‌దనీ ఆయ‌న న‌మ్ముతున్నారు. అన్నీ అనుకూలిస్తే స‌మీప భ‌విష్య‌త్తులోనే మ‌నం నాగ‌ర‌త్న‌మ్మ పాత్ర‌లో అనుష్క‌ను చూసే అవ‌కాశం ఉంది.

సింగీతం చివ‌రిసారిగా ఏడేళ్ల క్రితం 'వెల్‌క‌మ్ ఒబామా' అనే చిత్రాన్ని రూపొందించారు. 88 ఏళ్ల వ‌య‌సులోనూ చురుకుగా ఉన్న ఆయ‌న మ‌ళ్లీ మెగాఫోన్ ఎప్పుడెప్పుడు ప‌ట్టుకుందామా అని ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు అనుష్క లేటెస్ట్ మూవీ 'నిశ్శ‌బ్దం' విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఏప్రిల్ 2న విడుద‌ల కావా ల్సిన ఆ సినిమాని క‌రోనా వైర‌స్ భ‌యం కార‌ణంగా వాయిదా వేశారు.


Cinema Galleries



Latest News


Video-Gossips