ఓటీటీకి విజయ్ దేవరకొండ తమ్ముడి సినిమా!
on Jul 13, 2020
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ మీద వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. ఒక్కసారిగా ఈ సినిమా లైమ్ లైట్లోకి వచ్చింది. షూటింగ్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వగైరా వగైరా కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయని ప్రకటించారు. ఫస్ట్ కాపీ రెడీగా ఉందని నిర్మాత తెలిపారు. దీనికి అసలు రీజన్ ఏంటంటే... సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
తెలుగులో ఈ మధ్య చిన్న హీరోలు నటించిన సినిమాలను ఓటీటీకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. మళ్లీ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఓటీటీకి ఇవ్వడమే మేలని అనుకుంటున్నారట. లాక్ డౌన్ అనౌన్స్ చేయడానికి ముందే 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఫస్ట్ కాపీ రెడీ అయిందట. థియేటర్లు ఓపెన్ అవుతాయేమో అని వెయిట్ చేశారు. ఇప్పుడు డైరెక్టు డిజిటల్ రిలీజ్ బెటర్ అని ఫిక్స్ అయ్యారట.
వినోద్ అనంతోజు దర్శకుడిగా పరిచయం అవుతున్న 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన '96'లోనూ, దాని తెలుగు వెర్షన్ 'జాను'లోనూ హీరో దగ్గర ట్రైనీ ఫొటోగ్రాఫర్ క్యారెక్టర్ చేసిన ఆమె, శివ కందుకూరి హీరోగా పరిచయమైన 'చూసీ చూడంగానే' మూవీలో హీరోయిన్గా నటించింది. అలాగే విజయ్ హీరోగా నటించిన 'బిగిల్' సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఓటీటీ రిలీజ్ కి ఆమె క్రేజ్ కూడా కాస్త హెల్ప్ అవుతుంది.