English | Telugu

అల్లు అర్జున్ డబుల్ రోల్?

on Feb 24, 2020

 

అవును, ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ హాట్‌గా ప్రచారంలోకి వచ్చిన వదంతి ఇదే. 'అల.. వైకుంఠపురములో' వంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. బన్నీ ఇందులో పాల్గొంటున్నాడు. తొలి షెడ్యూల్ అతను లేకుండానే జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ నడుస్తుందనీ, అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడంటూ ఇదివరకే ప్రచారంలోకి వచ్చింది.

లేటెస్టుగా ఈ మూవీలో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడంటూ ప్రచారం మొదలైంది. ఆన్‌లైన్‌లో ఇది వైరల్‌గా మారింది. లారీ డ్రైవర్ క్యారెక్టర్‌తో పాటు మోడ్రన్ లుక్‌తో ఉండే ఇంకో క్యారెక్టర్‌ను కూడా బన్నీ చేస్తున్నాడనేది ఆ ప్రచార సారాంశం. లారీ డ్రైవర్‌గా అతను పెంచిన గడ్డం, పొడవాటి జుట్టుతో కనిపించనున్నాడు. ప్రస్తుతానికి ఇది స్పెక్యులేషన్‌గానే ఉంది. బన్నీ సన్నిహిత వర్గాలు ఈ ప్రచారాన్ని ధ్రువీకరించనూ లేదు, ఖండించనూ లేదు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బన్నీ జోడీగా తొలిసారి రష్మికా మందన్న నటిస్తోంది.


Cinema Galleries



Latest News


Video-Gossips