బన్నీ అమెరికా ఎందుకెళ్తున్నాడో తెలుసా?
on Jul 26, 2017

తాను చేసే ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించాలని తపించే హీరో అల్లు అర్జున్. ‘ఆర్యా’ నుంచి ‘దువ్వాడ జగన్నాధం’ వరకూ తాను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకు రుచి చూపించడం బన్నీ స్టయిల్. హెయిర్ స్టయిల్ కావచ్చు... డ్రస్ కోడ్ కావచ్చు... శరీరాకృతిలో మార్పు కావచ్చు.. ఇలా ఏదో ఒక కొత్తదనం తన సినిమాలో ఉండేలా చూసుకుంటాడు బన్నీ. అసలు సౌత్ సినీ స్టార్స్ లో తొలుత సిక్స్ ప్యాక్ చేసిన హీరో బన్నీనే. ‘దేశ ముదురు’ చిత్రంతో ఈ ఫీట్ చేశాడు తను. త్వరలో మరో ఫీట్ చేయడానికి సమాయత్తమవుతున్నాడని అంతరంగిక వర్గాల భోగట్ట. బన్నీ ఇప్పుడు చేయబోతున్న చిత్రం ‘నా పేరు సూర్య.. నా ఊరు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో బన్నీ... మిలటరీ మేన్ గా కనిపించబోతున్నట్టు వినకిడి.
అందుకే... ఫిజిక్ లో కొంత మార్పు అవసరమని దర్శకుడు చెప్పడంతో... తన శరీరాకృతి మార్చుకునే పనిలో పడ్డాడు స్టయిలిష్ స్టార్. ఇందులో భాగంగా త్వరలో తను అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడి ట్రైనర్స్ సహకారంతో... తన శరీరాకృతిని పాత్రకు తగ్గట్టుగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారట బన్నీ. ఇందులో బన్నీ ఓ కొత్త రీతిలో దర్శనమిస్తాడని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. అను ఇమ్మానియేలు కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం... విశాల్-శేఖర్ స్వరాలు అందించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలిసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



