సర్ప్రైజ్.. బన్నీ డాన్సుల్లో అతనికే తప్పులు కనిపిస్తుంటాయి!
on Sep 22, 2020
టాలీవుడ్ హీరోల్లో టాప్ డాన్సర్ ఎవరంటే అందరూ చెప్పే మొదటి పేరు అల్లు అర్జున్. ఎలాంటి క్లిష్టమైన మూవ్మెంట్నైనా సునాయాసంగా చేస్తూ ప్రేక్షకులకు కనువిందు చేస్తుంటాడు బన్నీ. అందుకే హీరోయిన్లు సైతం బన్నీతో పాటల్లో డాన్స్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. కొరియోగ్రాఫర్స్ అయితే బన్నీని దృష్టిలో పెట్టుకొని, ప్రత్యేకంగా అతడి కోసం రకరకాల విన్యాసాలు కంపోజ్ చేస్తుంటారు. అయినా వాటిని ఇష్టంగా చేస్తుంటాడు బన్నీ.
డాన్స్‌లో తనకు ఎవరు పోటీ అని బన్నీ భావిస్తుంటాడు? "డాన్సుల్లో నేనెవరికీ పోటీ కాను. నాకు నేనే పోటీ." అంటాడతను. ఆశ్చర్యమేమంటే అతడి చేసే డాన్సుల్లో అతడికే తప్పులు కనిపిస్తాయంట. "నేను మంచి డాన్సర్‌నని అందరూ అంటూ ఉంటారు. కానీ నేను చేసిన వాటిలో నాకు తప్పులు కనిపిస్తుంటాయి. ఆ సంగతి ఎవరికీ తెలీదు. పాట చూసుకునేటప్పుడు నాకే సంతృప్తి కలగదు. అయినా ఈ రోజుల్లో డాన్స్ అనేది పెద్ద యుఎస్పీ (అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్) కాదని నా అభిప్రాయం." అని చెప్పాడు బన్నీ.
ఒకప్పుడు డాన్సులు కొత్త కానీ, ఇప్పుడందరూ డాన్సులు బాగా చేస్తున్నారనేది ఒక వాస్తవం. ఆ విషయం బన్నీ ఒప్పుకుంటాడు. "నిజంగా ఇప్పటి హీరోల్లో తారక్, చరణ్, రామ్, నితిన్ బాగా డాన్స్ చేస్తారు. ఇదివరకు నలుగురు హీరోలే ఉండేవాళ్లు. ఇప్పుడు పది మంది హీరోలున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. నేనొక్కడినే డాన్స్ చేస్తాను అని చెప్పుకొనే పరిస్థితి లేదు. కాకపోతే నేను డాన్సుల మీద ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తుంటా కాబట్టి నా డాన్సుల్లో ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంటుంది." అని అతను తెలిపాడు.
Also Read