నివేదా థామస్‌కు కొవిడ్.. వాక్సిన్ తీసుకున్నా అల్లు అరవింద్‌కు కరోనా!
on Apr 3, 2021
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన అల్లు అరవింద్‌కు కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన రెండో డోసు వాక్సిన్ కూడా తీసుకొని ఉండటం గమనించాల్సిన విషయం. ఇలా సెకండ్ డోస్ వాక్సిన్ వేయించుకున్నాక కూడా కరోనా బారిన పడ్డ తొలి సెలబ్రిటీగా అరవింద్ నిలిచారు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో అధికారికంగా ఆయన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
ఇదివరకు డైరెక్టర్ త్రివిక్రమ్ తొలి డోసు వాక్సిన్ తర్వాత కొవిడ్ బారిన పడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయనకు నెగటివ్‌గా నిర్ధారణ అయింది.
కాగా హీరోయిన్ నివేదా థామస్ సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఓ నోట్‌ను పోస్ట్ చేసింది. "నాకు కొవిడ్-19 పాజిటివ్ అని టెస్టుల్లో తేలింది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నాను. కంప్లీట్ రికవరీ అయ్యేందుకు వైద్యుల సలహాలు తీసుకుంటున్నాను." అని అందులో రాసుకొచ్చింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
