అక్షరకు అంతసీన్ లేదా?
on Mar 25, 2015

శ్రుతి హాసన్....ఈ పేరు వింటేనే కుర్లాళ్ల గుండె వేగం పెరుగుతుంది. అమ్మడు స్క్రీన్ పై కనిపించగానే థియేటర్లో సెగలు పెరుగుతాయి. అందం మాత్రమేనా నటనలోనూ దుమ్ముదులిపేస్తుంది. మరోవైపు డాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్ ఇలా...ఒక్కమాటలో చెప్పాలంటే శ్రుతి ఆల్ రౌండర్ అనొచ్చు. అందుకే ఏ వుడ్ కి వెళ్లినా...ఏ రంగంలో వేలుపెట్టినా కాస్త లేటైనా శ్రుతి నెగ్గుకొచ్చేస్తుంది. కానీ అక్షర హాసన్ కు అంతసీన్ లేదన్నదే ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్. షమితాబ్ తో ఎంట్రీ ఇచ్చిన అక్షర....సగటు మార్కులు మాత్రమే దక్కించుకుంది. పైగా అందంలోనూ శ్రుతితో పోటీ పడలేకపోయింది. ఆ సంగతి పక్కనపెడితే ఈ మధ్యే ఓ ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ పై అడుగుపెట్టిన అక్షర తడబడింది. వేసుకున్న డ్రస్ తో ఇబ్బంది పడి ర్యాంప్ పై ఆదరాబాదరగా నడిచేసింది. దీంతో శ్రుతిని మించుతుందనుకున్న అక్షర ఆరంభంలోనే మైనస్ మార్కులేయించుకుందని బీటౌన్ జనాలు గుసగుసలాడుకున్నారు. వారసురాలిగా కమల్ పేరు శ్రుతి నిలబెడుతుంది కానీ..అక్షర డౌటే అన్నారు. అయితే ఇంకొందరు మాత్రం శ్రుతిహాసన్ కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాక కదా హీరోయిన్ గా స్థిరపడింది. అక్షర కెరీర్ కూడా అలాగే సాగుతుందేమో అంటున్నారు. మరి అక్షర భవిష్యత్ ఏంటో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



