'అఖిల్' మాస్టర్ ప్లాన్ అదిరింది!!
on Nov 6, 2015
.jpg)
వచ్చే వారం రిలీజ్ కాబోతున్న 'అఖిల్' సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలేనట. మామూలుగా అరంగేట్ర హీరోల సినిమాలు రెండున్నర గంటలకు దగ్గరగా ఉంటాయి. ఆ హీరోల టాలెంట్ చూపించడానికి పాటలు, ఫైట్లు ఎక్కువ పెడతారు కాబట్టి వాటికే ముప్పావు గంటదాకా పోతుంది కాబట్టి.. మిగతా కథను గంటన్నరపైనే నడపాల్సి ఉంటుంది. ఐతే 'అఖిల్' విషయంలో మాత్రం నిడివి విషయంలో అస్సలు ఛాన్స్ తీసుకోవట్లేదు. పాటలు, ఫైట్ల విషయంలో ఢోకా ఏమీ లేదు కానీ.. మిగతా కథనాన్ని చాలా షార్ప్ గా ఎడిట్ చేశారట.ముందు ఫైనల్ కాపీలో ఉన్న సన్నివేశాలకు కూడా కోత వేసి.. సినిమాను షార్ప్ గా ఉండేలా తయారు చేశారట. ఐతే ఇలా కట్ చేసిన సన్నివేశాల్ని అలా హోల్డ్ లో పెడుతున్నారట. సినిమాకు మంచి టాక్ వస్తే రెండో వారం నుంచి స్పెషల్ అట్రాక్షన్ గా యాడ్ చేద్దామనుకుంటున్నారట. సో అక్కినేని కుర్రాడి ప్లాన్ బాగానే వుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



