గీతాతో అయినా అఖిల్ రాత మారుతుందా!!!
on Feb 19, 2019
`అఖిల్`, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో అఖిల్ నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ సినిమాలు మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇక తన తదుపరి సినిమా విషయంలో ఆచి తూచి అడుగువేస్తున్నాడు అఖిల్. ప్రస్తుతం అఖిల్ నాలుగో సినిమా గురించి వార్తొకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే...ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే గీతా ఆర్ట్స్ లో కథ ఫైనల్ చేసుకున్న బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట వినికిడి. ఒంగోలు గిత్త తర్వాత ఇంత వరకు ఏ సినిమా చేయలేదు భాస్కర్. కొంత గ్యాప్ తర్వాత చేస్తోన్న ఈ సినిమా సక్సెస్ చేయాలన్న కసితో వర్క్ చేస్తున్నాడట భాస్కర్. అఖిల్ కూడా వరుస ఫ్లాప్ లతో విసిగిపోయున్నాడు. ఈ సినిమాతో తనేంటో ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్రానికి గోపిసుందర్ ని సంగీత దర్శకుడుగా ఫైనల్ చేసారని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.