`RRR`లో అజయ్ దేవగణ్ పాత్ర ఏంటో తెలుసా??
on Jul 9, 2019
`
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఏస్ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఈ భారీ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ తండ్రి పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ నటిస్తున్నాడట. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలో నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభించుకోనుంది. ఈ షెడ్యూల్ లో అజయ్ దేవ్ గన్ పాల్గొనే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం కీరవాణి అద్భుతమైన బాణీలు సిద్దం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటల కంపోజింగ్ పూర్తైందట. ఇందులో ఒక పాటను సుద్దాల అశోక్ తేజ్ రాయగా మరో పాటను సిరివెన్నెల రాసినట్లు సమాచారం. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం 2020 జూలై 30 న రానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
