English | Telugu

త్రివిక్రమ్ కావాలనే ఫ్లాప్ చేశాడా..?

on Jan 11, 2018

స్నేహమంటే నమ్మకం.. ఆపదలో ఆదుకునే వాడు.. మార్గదర్శనం చేసేవాడు స్నేహితుడు ఒక్కడే. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది బెస్ట్ ఫ్రెండే. కానీ నమ్మిన స్నేహితుడే మరిన్ని కష్టాలలోకి తోసేస్తే ఆ నమ్మిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలతో దారుణమైన ఫ్లాప్స్ రావడంతో.. ఈ సారి అభిమానులకు మంచి హిట్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. తనను ఎలా చూపించాలో.. ఎలా చూపిస్తే అభిమానులకు నచ్చుతుందో బాగా తెలిసిన వ్యక్తి తన బెస్ట్‌ఫ్రెండ్ త్రివిక్రమ్ అని నమ్మి వెంటనే ఛాన్సిచ్చాడు.

పవన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో, యాక్షన్ సీక్వెన్స్‌తో, భారీ స్టార్ క్యాస్టింగ్‌తో అజ్ఞాతవాసిని తెరకెక్కించాడు త్రివిక్రమ్. టీజర్, ట్రైలర్ చూసిన వారంతా ఇంకేముంది బ్లాక్‌బస్టర్ హిట్ గ్యారెంటి అనుకున్నారు. అదే టైంలో అజ్ఞాతవాసి బేస్ లైన్‌ త్రివిక్రమ్ బుర్ర నుంచి పుట్టిన ఐడియా కాదని.. ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ కొట్టాడు అంటూ వార్తలు వచ్చాయి. సరే ఇప్పుడు కాపీ కొట్టని డైరెక్టర్ ఎవరున్నారులే అని అంతా సరిపెట్టుకున్నారు. తీరా సినిమా చూసిన పవన్ అభిమాని నీరుగారిపోయాడు. పవర్‌స్టార్ ఓ పొలిటికల్ పార్టీకి అధినేత అని.. యూత్ ఐకాన్ అన్న విషయాన్ని మరచిపోయి పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేయించాడు.

త్రివిక్రమ్ నుంచి కామెడీ.. పంచ్ డైలాగ్స్, సరికొత్త స్క్రీన్‌ప్లే ఎక్స్‌పెక్ట్ చేసిన అభిమానులకు అసలు ఇది త్రివిక్రమ్ సినిమానా అన్న డౌట్ క్రియేట్ చేశాడు.. అంటూ సోషల్ మీడియాలో అభిమానులు రగిలిపోతున్నారు. అయితే తన ప్రాణ స్నేహితుడికి సినిమాల పరంగానూ.. రాజకీయాల పరంగానూ బూస్ట్ ఇచ్చే హిట్ ఇవ్వాలనుకున్న త్రివిక్రమ్‌పై విపరీతమైన ఒత్తడి ఉంటుంది. దానికి తోడు ఇద్దరి కాంభినేషన్‌లో వచ్చిన సినిమాలకి మించి ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మరి వీటన్నింటికి న్యాయం చేయాలంటే కత్తి మీద సామే.

అయితే పవన్ క్రేజ్‌కు తోడు నేనేం రాస్తే అదే.. పంచ్.. అదే డైలాగ్ అని అదే సినిమాను సూపర్‌హిట్ చేస్తుందని.. త్రివిక్రమ్ ఫీలయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే అజ్ఞాతవాసికి చేటు చేసిందంటున్నారు. తప్పులు ఎవరైనా చేస్తారు.. కానీ నిర్లక్ష్యం మాత్రం క్షమించదగినది కాదు. ఇప్పుడు ఆ నిర్లక్ష్యం కోట్లాదిమంది అభిమానులకు నిరాశను.. కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన నిర్మాతకు ఇబ్బందులను తెచ్చిపెట్టిందని.. ఇప్పటికైనా జరిగిన తప్పును సరిదిద్దుకుని త్రివిక్రమ్ ఈ సారైనా జాగ్రత్తగా సినిమాలను తీయాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here